Joe Root equals Kumar Sangakkara test centurys
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ శతకంతో చెలరేగాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీని అందుకున్నాడు. 178 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో రూట్ మూడు అంకెల స్కోరు చేరుకున్నాడు. టెస్టుల్లో జోరూట్‌కు ఇది 38వ శతకం కావడం విశేషం. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరతో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు.
టెస్టుల్లో అత్యధిక శతకాలు చేసిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 200 టెస్టుల్లో 51 శతకాలు చేశాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వెస్ కలిస్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉండగా 41 శతకాలతో ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ మూడో స్థానంలో నిలిచాడు.
Rishabh Pant : అరెరె.. పంత్ అద్భుత రికార్డు సాధించాడుగా.. గాయం మ్యాటర్‌లో పడి అందరూ..
టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 200 మ్యాచ్‌ల్లో 51 శతకాలు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 166 మ్యాచ్‌ల్లో 45 శతకాలు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 168 మ్యాచ్‌ల్లో 41 శతకాలు
కుమార సంగక్కర (శ్రీలంక) – 134 మ్యాచ్‌ల్లో 38 శతకాలు
జోరూట్ (ఇంగ్లాండ్) – 157 మ్యాచ్‌ల్లో 38 శతకాలు
భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా..
తాజాగా శతకంతో భారత జట్టు పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా జోరూట్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు ఆసీస్ ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ను అధిగమించాడు. స్మిత్ భారత్ పై 11 టెస్టు శతకాలు చేయగా జోరూట్‌కి ఇది 12వ సెంచరీ.
ఇక టెస్టుల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు రూట్. ఆస్ట్రేలియా ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇంగ్లాండ్ పై 15 టెస్టు సెంచరీలు చేశాడు. ఆ తరువాత జాబితాలో సునీల్ గవాస్కర్ ఉన్నాడు. గవాస్కర్ విండీస్ పై 13 శతకాలు బాదాడు.
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) – ఇంగ్లాండ్ పై 19 సెంచరీలు
సునీల్ గవాస్కర్ (భారత్) – వెస్టిండీస్ పై 13 సెంచరీలు
జాక్ హాబ్స్ (ఇంగ్లాండ్) – ఆస్ట్రేలియాపై 12 సెంచరీలు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – ఇంగ్లాండ్ పై 12 శతకాలు
జోరూట్ (ఇంగ్లాండ్) – భారత్ పై 12 శతకాలు