Suryakumar Yadav : భారత మహిళా జట్టు ప్లేయర్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ‘ఆరా ఫార్మింగ్’ డాన్స్.. వీడియో వైరల్..
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Suryakumar Yadav Aura Farming Dance With Shreyanka Patil
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సూర్య భారత మహిళా జట్టు స్పిన్నర్ శ్రేయంకా పాటిల్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. వీరిద్దరూ ‘ఆరా ఫార్మింగ్’ ట్యూన్‌కు డ్యాన్స్ చేశారు.
ఇండోనేషియాకు చెందిన 11 ఏళ్ల పిల్లవాడు ఆరా ఫార్మింగ్ బోట్ రేసింగ్ సందర్భంగా చేసిన ఈ డ్యాన్స్ అప్పట్లలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఇదే డ్యాన్స్‌ను సూర్య, శ్రేయాంక చేశారు. ముఖ్యంగా సూర్య తనదైన శైలిలో ఫన్నీగా చేశాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. సూర్య ఇచ్చిన క్యాప్షన్ సైతం ఆకట్టుకుంటోంది. మేనేజర్ ట్రెండ్ చేయమన్నాడు.. కాబట్టి చేయాల్సి వచ్చింది అని రాసుకొచ్చాడు.
Suryakumar Yadav and Shreyanka Patil in the ‘Aura Farming’ trend reel. pic.twitter.com/xh60rPVwx5
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2025
సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే.. టీ20ల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికి కూడా వన్డేలు, టెస్టుల్లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడతోంది. ఈ సిరీస్ తరువాత భారత జట్టు వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది.
Tilak Varma : ఓ పక్క భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు తిలక్ వర్మ వరుస సెంచరీలు..
అనంతరం ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లనుంది. తొలుత ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. ఆ తరువాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుండగా, టీ20 సిరీస్ అక్టోబర్ 25 నుంచి ఆరంభం కానుంది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌తోనే సూర్యకుమార్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది.