ENG vs IND : టెస్టు క్రికెట్ చరిత్రలోనే జోరూట్ అరుదైన ఘనత.. అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా.. కలిస్, ద్రవిడ్ రికార్డులు బ్రేక్..
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ అరుదైన ఘనత సాధించాడు.

Joe Root become the third leading run scorer in Test cricket history
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు జాక్వెస్ కలిస్, భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌లను అధిగమించాడు. మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు.
ద్రవిడ్ 164 టెస్టు మ్యాచ్‌ల్లో 52.31 సగటుతో 13,288 పరుగులు చేశాడు. జాక్వెస్ కలిస్ 166 మ్యాచ్‌ల్లో 55.37 సగటుతో 13,289 పరుగులు చేశాడు. రూట్ 157 టెస్టు మ్యాచ్‌ల్లోనే వీరిని అధిగమించడం గమనార్హం.
Tilak Varma : ఓ పక్క భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు తిలక్ వర్మ వరుస సెంచరీలు..
ఇక టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 200 టెస్టుల్లో 53.78 సగటుతో 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత 13,378 పరుగులతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచేందుకు రూట్‌కు ఇంకో 88 పరుగులే అవసరం.
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 200 మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 168 మ్యాచ్‌ల్లో 13,378 పరుగులు
జోరూట్ (ఇంగ్లాండ్) – 157 మ్యాచ్‌ల్లో 13,290* పరుగులు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 166 మ్యాచ్‌ల్లో 13,289 పరుగులు
రాహుల్ ద్రవిడ్ (భారత్) – 164 మ్యాచ్‌ల్లో 13,288 పరుగులు.