Rishabh Pant : అరెరె.. పంత్ అద్భుత రికార్డు సాధించాడుగా.. గాయం మ్యాట‌ర్‌లో ప‌డి అంద‌రూ..

టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

ENG vs IND 4th test Pant Equals Sehwag Record Of Most Sixes For India In Tests

టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాడిగా సెహ్వాగ్‌తో క‌లిసి అగ్ర‌స్థానంలో నిలిచాడు. మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంత్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు.

ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట‌లో తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో రివ‌ర్స్ స్వీప్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి పంత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌డు 37 ప‌రుగుల వ‌ద్ద రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే.. రెండో రోజు మాత్రం బాధ‌ను పంటి దిగువ‌న బిగ‌బ‌ట్టి బ‌రిలోకి దిగిన పంత్ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. మొత్తంగా 75 బంతులు ఎదుర్కొన్న పంత్ 54 ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి.

Suryakumar Yadav : భార‌త మ‌హిళా జ‌ట్టు ప్లేయ‌ర్‌తో క‌లిసి సూర్యకుమార్ యాదవ్ ‘ఆరా ఫార్మింగ్’ డాన్స్.. వీడియో వైర‌ల్‌..

కాగా.. ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో సిక్స‌ర్ కొట్టిన పంత్ సెహ్వాగ్ రికార్డును స‌మం చేశాడు. టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్ బ్యాటింగ్ చేస్తే సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేయ‌డం పెద్ద క‌ష్టం ఏమీ కాదు.

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు వీరే..
* రిషభ్‌ పంత్ – 47 మ్యాచ్‌ల్లో 90* సిక్సర్లు
* వీరేందర్‌ సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
* రోహిత్‌ శర్మ- 67 మ్యాచ్‌ల్లో 88 సిక్సర్లు
* ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు
* రవీంద్ర జడేజా – 84 మ్యాచ్‌ల్లో 74 సిక్సర్లు

ENG vs IND : టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే జోరూట్ అరుదైన ఘ‌న‌త‌.. అత్యధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా.. క‌లిస్, ద్ర‌విడ్ రికార్డులు బ్రేక్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రిష‌బ్ పంత్ (54)తో పాటు య‌శ‌స్వి జైస్వాల్ (58), సాయి సుద‌ర్శ‌న్ (61)లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 ప‌రుగులు చేసింది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు లంచ్ విరామానికి రెండు వికెట్ల న‌ష్టానికి 332 ప‌రుగులు చేసింది. ఓలీపోప్ (70), జోరూట్ (63)లు క్రీజులో ఉన్నారు.