ENG vs IND 5th test KL Rahul and Kumar Dharmasena engage in heated exchange
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్,ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. సిరీస్‌ను సమం చేయాలని టీమ్ఇండియా ప్లేయర్లు ఆడుతుండగా, అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు 11 మందే అడుతున్నప్పటికి వారికి ఓ వ్యక్తి మైదానంలో ఉండి 12వ ఆటగాడిగా సాయం చేస్తున్నాడు. అతడు మరెవరో కాదు ఫీల్డ్ అంఫైర్ కుమార్ ధర్మసేన.
తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ రివ్యూ వృథా కాకుండా.. బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్నట్లుగా స్నిగల్ ఇచ్చి ఆ జట్టుకు సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండ రోజు ఆటలో అతడు కేఎల్ రాహుల్‌తో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుమార్ ధర్మసేన, కేఎల్ రాహుల్ తీవ్ర మాటల యుద్ధం నడించింది.
చరిత్ర సృష్టించిన సిరాజ్.. జస్ర్పీత్ బుమ్రా రికార్డు బద్దలు.. 29ఏళ్ల తరువాత అరుదైన ఘనత..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. జో రూట్ బ్యాటింగ్ చేస్తుండగా టీమ్ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓ అద్భుత బంతిని రూట్ ఆడలేకపోయాడు. ఆ సమయంలో ప్రసిద్ధ్, రూట్ ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. ఆ తరువాత రూట్ ఫోర్ కొట్టడంతో పరిస్థితి కాస్త ఉద్వేగంగా మారింది.
వెంటనే ఫీల్డ్ అంపైర్లు అసాన్ రజా, కుమార్ ధర్మసేనలు మధ్యలో కలగజేసుకుని ఇటు రూట్, అటు ప్రసిద్ధ్ కృష్ణకు నచ్చ చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. ప్రసిద్ధ్ ను ఎగతాళి చేసినట్లుగా రూట్ మాట్లాడడంతో కేఎల్ రాహుల్ తన సహచరుడికి అండగా నిలిచేందుకు అక్కడకు వచ్చాడు.
ఏం జరిగిందో తెలుసుకునేందుకు అంపైర్ కుమార్ ధర్మసేనను అడిగాడు. కేఎల్ అలా అడగడం అతడికి నచ్చలేదేమో తెలీయదు కానీ.. కేఎల్ అలా అడగడం తప్పు అన్నట్లుగా మాట్లాడాడు.
Virat Kohli : బాత్రూమ్‌లో విరాట్ కోహ్లీ వెక్కి వెక్కి ఏడవడం చూశాను : చాహల్
వీరిద్దరి మధ్య మాటలు ఇలా సాగాయి..
రాహుల్ : మమ్మల్ని ఏం చేయమంటారు? నిశ్శబ్దంగా ఉండమంటారా?
ధర్మసేన : ఎవరైనా బౌలర్ ఇలా వస్తే మీకు ఇష్టమేనా? మీరు అలా ప్రవర్తించడం సరికాదు.
రాహుల్ : అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? బ్యాటింగ్, బౌలింగ్ చేసి వెళ్లిపోమంటారా?
ధర్మసేన : ఈ విషయాలు మనం ఆట ముగిశాక మాట్లాడుకుందాం. నువ్వు అలా మాట్లాడకూడదు. అని అన్నాడు
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు చేయగా ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమాయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (51), ఆకాశ్ దీప్ (4) లు క్రీజులో ఉన్నారు.