ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. టీమ్‌ఇండియా స్క్వాడ్‌లోకి మరో ఆటగాడు..!

భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మ‌రో మూడు రోజుల్లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ENG vs IND Harshit Rana To Stay Back In England Report

భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మ‌రో మూడు రోజుల్లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో బీసీసీఐ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇంగ్లాండ్ ల‌య‌న్స్‌తో అన‌ధికారిక టెస్టులు ఆడేందుకు ఇండియా-ఏతో పాటు ఇంగ్లాండ్‌కు వెళ్లిన యువ పేస‌ర్ హ‌ర్షిత్ రాణా.. సిరీస్ ముగిసినా భార‌త్‌కు రాలేదు. అత‌డిని బీసీసీఐ ఇంగ్లాండ్‌లో ఉండ‌మ‌న్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

అత‌డు త్వ‌ర‌లోనే భార‌త జ‌ట్టుతో క‌ల‌వ‌బోతున్న‌ట్లుగా స‌ద‌రు వార్తాల సారాంశం. అత‌డిని ప్ర‌త్నామ్నాయ ఆట‌గాడిగా భార‌త జ‌ట్టుతో కొన‌సాగించ‌వ‌చ్చు. అవ‌స‌రం అనుకుంటే జ‌ట్టులోకి తీసుకోనుంది. ఇదే గ‌నుక నిజం అయితే.. ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపికైన ఆట‌గాళ్ల సంఖ్య 19కి చేర‌నుంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

WTC 2025-27 : డ‌బ్ల్యూటీసీ నాలుగో సైకిల్ షురూ.. 9 జ‌ట్లు 131 మ్యాచ్‌లు.. భార‌త జ‌ట్టు షెడ్యూల్ ఇదే..

గ‌తేడాది ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో హ‌ర్షిత్ రాణా అరంగ్రేటం చేశాడు. 2 మ్యాచ్‌ల్లో కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. దీంతో సెల‌క్ట‌ర్లు అత‌డిని ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేయ‌లేదు. అయితే.. ఇప్పుడు అత‌డికి అనుకోకుండా ఛాన్స్ ల‌భించే అవ‌కాశం ఉంది.

రాణా 13 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 27.79 స‌గ‌టుతో 48 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 32.80 స‌గ‌టుతో ప‌రుగులు చేశాడు. ఓ సెంచ‌రీ, రెండు హాఫ్ సెంచ‌రీలు అత‌డి పేరిట ఉన్నాయి.

ENG vs IND : ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై అత్య‌ధిక టెస్టు విజ‌యాలు సాధించిన‌ భార‌త కెప్టెన్ ఎవ‌రో తెలుసా?

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత్.. 2007 తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలవాలనే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ సిరీస్‌తోనే భార‌త జ‌ట్టు డ‌బ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది.