ENG vs IND Pant Becomes 3rd Indian To Take 150 Test Catches As Wicketkeeper
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో టీమ్ఇండియా తరుపున 150 క్యాచ్‌లు అందుకున్న మూడో వికెట్ కీపర్‌గా రికార్డులకు ఎక్కాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో పంత్ ఈ ఘనత సాధించాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఓలీపోప్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ పంత్ అందుకున్నాడు.
టెస్టుల్లో సయ్యద్ కిర్యాణి (160 క్యాచ్‌లు), ఎంఎస్ ధోని(256 క్యాచ్‌లు) లు మాత్రమే పంత్ కన్నా ముందు ఈ ఘనత సాధించారు. మొత్తంగా పంత్ 151 క్యాచ్‌లు 15 స్టంపింగ్‌లతో కలిసి 166 డిస్మిసల్స్‌లో భాగం అయ్యాడు. ఈ విషయంలో టాప్ పొజిషన్‌లో ధోనీ ఉన్నాడు. మహేంద్రుడు 256 క్యాచ్‌లు 38 స్టంపింగ్‌లు (మొత్తం 294 డిస్మిసల్స్) చేశాడు.
Rishabh Pant: అయ్యో పంత్.. అలా ఎందుకు చేశావ్..! చర్యలకు సిద్ధమైన ఐసీసీ..
Milestone Alert 🚨
Vice-captain Rishabh Pant completes 1⃣5⃣0⃣ catches in Test cricket 👏👏
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @RishabhPant17 pic.twitter.com/6ANBpkgmhO
— BCCI (@BCCI) June 22, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
సిక్స్ అనుకుంటే ఔట్ చేశారు..! బౌండరీలైన్ వద్ద జడేజా, సాయి సుదర్శన్ కళ్లుచెదిరే క్యాచ్.. వీడియో వైరల్
ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమ్ఇండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (6) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలా ఆడతారు అన్న దానిపైనే మ్యాచ్ ఆధారపడి ఉంది.