సిక్స్ అనుకుంటే ఔట్ చేశారు..! బౌండరీలైన్ వద్ద జడేజా, సాయి సుదర్శన్ కళ్లుచెదిరే క్యాచ్.. వీడియో వైరల్

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిధ్ కృష్ణ వేసిన 80వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద జడేజా - సాయి సుదర్శన్ కలిసి స్టన్నింగ్ క్యాచ్‌‌ అందుకున్నారు.

సిక్స్ అనుకుంటే ఔట్ చేశారు..! బౌండరీలైన్ వద్ద జడేజా, సాయి సుదర్శన్ కళ్లుచెదిరే క్యాచ్.. వీడియో వైరల్

ENG vs IND 1st Test

Updated On : June 23, 2025 / 8:26 AM IST

IND vs ENG: ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 471 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులు చేసింది. మూడోరోజు (ఆదివారం) ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. రాహుల్ (47 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్ (6బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నాల్గో రోజు ఆట కీలకంగా మారనుంది. ఇదిలాఉంటే.. మూడోరోజు ఆటలో రవీంద్ర జడేజా, సాయి సుదర్శన్ లు బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు.

Also Read: జైస్వాల్ గ్రౌండ్‌లో నిద్రపోతున్నావా ఏంటి..? మూడు క్యాచ్‌లు మిస్.. అన్నీ బుమ్రా బౌలింగ్‌లోనే.. బుమ్రా రియాక్షన్ వైరల్.. ఏమన్నాడంటే?

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిధ్ కృష్ణ వేసిన 80వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద జడేజా – సాయి సుదర్శన్ స్టన్నింగ్ క్యాచ్‌‌కు ఇంగ్లాండ్ బ్యాటర్ జేమీ స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ ఓవర్లో తొలి బంతిని జెమీ స్మిత్ సిక్స్ కొట్టాడు. రెండో బంతి బ్యాట్‌కు దగ్గరకు వెళ్తూ కీపర్ చేతిల్లోకి చేరింది. దీంతో ఔట్ అని అంపైర్ ను అపీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. రివ్యూ తీసుకోగా.. బంతి బ్యాట్ కు తాకలేదని తేలింది.

అదే ఓవర్లో మూడో బంతిని ప్రసిధ్ కృష్ణ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో షార్ట్‌పిచ్‌గా వేశాడు. దీంతో స్మిత్ భారీ షాట్ కొట్టాడు. ఆ బంతి సిక్స్ అని అందరూ భావించారు. కానీ, బౌండరీ లైన్ వద్ద జడేజా అద్భుత రీతిలో క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే, బౌండరీ లైన్ బయట పడుతున్న బంతిని జడేజా అందుకొని గాల్లోకి విసిరాడు. పక్కనే ఉన్న సాయి సుదర్శన్ ఆ బంతిని అందుకున్నాడు. దీంతో సిక్స్ పోతుందని అనుకున్న బంతిని క్యాచ్ అందుకోవటంతో జెమీ స్మిత్ (40) నిరాశగా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.


జడేజా, సాయి సుదర్శన్ లు చాకచక్యంగా సిక్స్ అనుకున్న బంతిని క్యాచ్ పట్టుకోవటంతో ఆటగాళ్లతోపాటు కామెంటేటర్లు, ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయ్యారు. ఇదిలాఉంటే.. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో డకౌట్ అయిన సాయి సుదర్శన్, రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగుల మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.