జైస్వాల్ గ్రౌండ్‌లో నిద్రపోతున్నావా ఏంటి..? మూడు క్యాచ్‌లు మిస్.. అన్నీ బుమ్రా బౌలింగ్‌లోనే.. బుమ్రా రియాక్షన్ వైరల్.. ఏమన్నాడంటే?

యశస్వీ జైస్వాల్ మూడు కీలక క్యాచ్‌లు వదిలేయడంతో డ్రెస్సింగ్ రూంలో కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు..

జైస్వాల్ గ్రౌండ్‌లో నిద్రపోతున్నావా ఏంటి..? మూడు క్యాచ్‌లు మిస్.. అన్నీ బుమ్రా బౌలింగ్‌లోనే.. బుమ్రా రియాక్షన్ వైరల్.. ఏమన్నాడంటే?

Yashasvi Jaiswal

Updated On : June 23, 2025 / 7:50 AM IST

Yashasvi Jaiswal Dropping 3 Catches in Ind vs Eng 1st Test: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ చెత్తరికార్డును నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ తో అదరగొట్టిన జైస్వాల్.. ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన మూడు క్యాచ్ లు జారవిడిచాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. జైస్వాల్ చెత్త ఫీల్డింగ్ పై క్రికెటర్ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ కారణంగా ఇంగ్లాండ్ 400 స్కోర్‌ను దాటేసిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.


తొలి ఇన్నింగ్స్ లో భారత్ పేవల ఫీల్డింగ్ ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ మూడు కీలక క్యాచ్ లను వదిలేశాడు. రెండోరోజు (శనివారం) ఆటలో ఓలీ పోప్ క్యాచ్‌ను జైశ్వాల్ నేలపాలు చేశాడు. ఓలీపోప్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్ ను జైస్వాల్ రెండో స్లిప్ లో జారవిడిచాడు. జైస్వాల్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓలీ పోప్ సెంచరీ పూర్తిచేసి ఇంగ్లాండ్ జట్టును పటిష్ఠస్థితికి చేర్చాడు. అంతేకాక.. మూడోరోజు (ఆదివారం) ఆటలో జైస్వాల్ మరో రెండు క్యాచ్ లను మిస్ చేశాడు.


మూడోరోజు ఆటలో బ్యాటర్ హ్యారీ బ్రూక్ 82 పరుగుల వద్ద ఉన్న సమయంలో బుమ్రా బౌలింగ్ లో సులభమైన క్యాచ్ ఇచ్చాడు. నాలుగో స్లిప్ లో ఉన్న జైస్వాల్ ఆ క్యాచ్ ను నేలపాలు చేశాడు. బుమ్రా బౌలింగ్ లోనే మరో క్యాచ్ ను జైస్వాల్ వదిలేశాడు. జైస్వాల్ చెత్త ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లాండ్ 400 పరుగులు దాటేసిందని మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జైస్వాల్ మూడు క్యాచ్‌లు మిస్ చేయడంతో డ్రెస్సింగ్ రూంలో కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు బౌలర్ జస్ర్పీత్ బుమ్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే, మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. ‘ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్ లు వదిలిపెట్టరు. ఇది ఆటలో భాగం. ఈ అనుభవం నుంచి ఆటగాళ్లు నేర్చుకుంటారు.’ అంటూ బుమ్రా పేర్కొన్నాడు.