Jacob Bethell ruled out of Champions Trophy 2025
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ చేజార్చుకుంది. కటక్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అసలే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని కెప్టెన్ జోస్ బట్లర్ ధ్రువీకరించాడు. ‘ఇది అతడికి ఎదురుదెబ్బ. అతడు చాలా మంచి ఆటగాడు. గాయం బారిన పడడం బాధాకరం.’ అని బట్లర్ తెలిపాడు.
తొడకండరాల గాయంతో జాకబ్ భాదపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో జరగనున్న మూడో వన్డేతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. కాగా.. నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికి జాకబ్ రాణించాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాది 51 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు. ఇలాంటి ఓ ప్లేయర్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడం నిజంగా ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
IND vs ENG : హర్షిత్ రాణా పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ‘నీ మైండ్ దొబ్బిందా’?
Welcome, Bants! 👋
Tom Banton called up as cover for the 3rd ODI against India in Ahmedabad.
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket
— England Cricket (@englandcricket) February 9, 2025
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో ఇంగ్లాండ్ జట్టు తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 12లోగా జట్టులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ షెడ్యూల్..
– ఫిబ్రవరి 22 న ఆస్ట్రేలియాతో
– ఫిబ్రవరి 26న అఫ్గానిస్థాన్‌తో
– మార్చి 1న దక్షిణాఫ్రికాతో
ఆదివారం కటక్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 22న జరగనుంది. జాకబ్ స్థానంలో టామ్ బాంటన్ ను మూడో వన్డేలకు ఇంగ్లాండ్ జట్టులోకి తీసుకుంది.