IND vs ENG : హర్షిత్ రాణా పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ‘నీ మైండ్ దొబ్బిందా’?
రెండో వన్డే సందర్భంగా హర్షిత్ రాణా పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

IND vs ENG 2nd ODI Rohit Sharma angry on Harshit Rana for giving overthrows
టీమ్ఇండియా యువ ఆటగాడు హర్షిత్ రాణాపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీ మైండ్ దొబ్బిందా అంటూ మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
కటక్ వేదికగా ఆదివారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 32వ ఓవర్‌ను హర్షిత్ రాణా వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ డిఫెన్స్ ఆడాడు. బంతి బౌలర్ హర్షిత్ రాణా వైపు వెళ్లింది. వెంటనే బంతిని అందుకున్న రాణా.. స్టంప్స్ వైపు గా బంతిని విసిరేశాడు. ఆ బాల్ కాస్త వికెట్లను తాకకుండా.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు అందనంత దూరంగా వెలుతూ బౌండరీ వెళ్లిపోయింది. దీంతో అనవసరంగా ఇంగ్లాండ్‌కు నాలుగు పరుగులు వచ్చాయి.
IND vs ENG : కోహ్లీ ఔట్ వెనుక సాంకేతిక లోపం ఉందా? ఔటైన తరువాత విరాట్ ఇచ్చిన రియాక్షన్ వైరల్..
KKR bully Harshit Rana went for 62 runs in 9 overs and that 1 wicket just bcz of a brilliant catch by Gill.
Playing over Arshdeep Singh and just bcz KKRs Gautam Gambhir favouring a KKR player.
You listen abuses when you are playing on their mercy.— अनुज यादव 🇮🇳 (@Hello_anuj) February 9, 2025
వాస్తవానికి అక్కడ రాణా అంతగా స్పందించాల్సిన పనిలేదు. అనవసరంగా ఓవర్ త్రో ద్వారా ఇంగ్లాండ్‌కు ఎక్స్‌ట్రా పరుగులు ఇవ్వడంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశకు గురి అయ్యాడు. బౌలింగ్ చేసేందుకు తనను దాటుకుంటూ వెలుతున్న హర్షిత్ రాణా పై మండిపడ్డాడు. నీ మైండ్ దొబ్బిందా? బంతిని ఎక్కడ కొట్టాలని ప్రయత్నించావ్ అని అన్నాడు. రోహిత్ మాట్లాడిన ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. కామెంటేటర్లతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు హర్షిత్ రాణా తీరును తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (69; 72 బంతుల్లో 6 ఫోర్లు), డకెట్ (65; 56 బంతుల్లో 10ఫోర్లు)లు హాఫ్ సెంచరీలు చేశారు. లివింగ్‌స్టన్ (41) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాదించారు.
ఆ తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 305 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లలో రోహిత్ కాకుండా శుభ్‌మన్ గిల్ (60) అర్థశతకం చేశాడు. శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41 నాటౌట్) లు రాణించారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (5) ఘోరంగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్, గుస్ అట్కిన్సన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 12న జరగనుంది.