Rohit Sharma : రెండో వన్డేలో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్.. వార్నీ ఇన్ని రికార్డులను బ్రేక్ చేశాడా.. సచిన్, ద్రవిడ్, గేల్ ..
రెండో వన్డేలో రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

Rohit Sharma breaks many records in ODIs after hitting century in Cuttack
గతకొన్నాళ్లుగా టీమ్ఇండియా కెప్టెన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు వ్యక్తిగతంగా పేలవఫామ్‌తో సతమతమవుతున్నాడు. మరోవైపు జట్టు వైఫలం బాధిస్తుండగా రిటైర్‌మెంట్ తీసుకోవాలని డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఇక తొలి వన్డేలో వైఫలంతో జట్టుకు మరింత భారంగా మారాడని, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే తప్పుకోవాలని అన్నారు. ఇలాంటి కిష్ల పరిస్థితుల్లో ఉన్న రోహిత్ శర్మ రెండో వన్డేలో మాత్రం తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. గత 16 నెలలుగా వన్డేల్లో సెంచరీ కరువును తీర్చుకున్నాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ధాటికి 300 పై చిలుకు లక్ష్యం ఎంతో తేలికైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 90 బంతులను ఎదుర్కొన్నాడు. 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులను రోహిత్ శర్మ అందుకున్నాడు. అవేంటో ఓ సారి చూద్దాం..
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 7 సిక్సర్లు బాదాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు. ఈ క్రమంలో క్రిస్‌గేల్ ను అధిగమించాడు. 301 మ్యాచ్‌ల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టగా.. రోహిత్ శర్మ 267 మ్యాచ్‌ల్లోనే 338 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) – 351 సిక్సర్లు
రోహిత్ శర్మ (భారత్) – 338 సిక్సర్లు
క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 331 సిక్సర్లు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 270 సిక్సర్లు
ఎంఎస్ ధోని (భారత్) – 229 సిక్సర్లు
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) – 220 సిక్సర్లు
సచిన్ రికార్డు బ్రేక్..
అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) అత్యధిక పరుగులు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. 346 మ్యాచ్‌లో సచిన్ ఓపెనర్‌గా వచ్చి 48.07 సగటుతో 15335 పరుగులు చేశాడు. కాగా.. రోహిత్ శర్మ 343 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి 15404 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విధ్వంకర వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమ్ఇండియా ఓపెనర్లు..
వీరేంద్ర సెహ్వాగ్ – 15,758 పరుగులు
రోహిత్ శర్మ – 15,404 పరుగులు
సచిన్ టెండూల్కర్ – 15,335 పరుగులు
ROHIT SHARMA, A LEGENDARY OPENER 🥶 pic.twitter.com/Wr1wTHyKGB
— Johns. (@CricCrazyJohns) February 9, 2025
ద్రవిడ్‌ను వెనక్కు నెట్టి..
తాజా ఇన్నింగ్స్‌తో వన్డేల్లో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. ద్రవిడ్ 344 వన్డేల్లో 10889 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 267 వన్డేల్లో 10987 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు..
సచిన్ టెండూల్కర్ – 18426 పరుగులు
విరాట్ కోహ్లీ – 13911 పరుగులు *
సౌరవ్ గంగూలీ – 11363 పరుగులు
రోహిత్ శర్మ – 10987 పరుగులు *
రాహుల్ ద్రవిడ్ – 10889 పరుగులు
కెప్టెన్‌గా 50వ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు..
కాగా.. కెప్టెన్ గా వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 50వ మ్యాచ్ కావడం విశేషం. వన్డేల్లో కెప్టెన్‌గా 50వ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య రికార్డును బ్రేక్ చేశాడు. జయసూర్య తన మైలుస్టోన్ మ్యాచ్‌లో 107 పరుగులు చేయగా తాజాగా రోహిత్ శర్మ 119 పరుగులు సాధించాడు.
రోహిత్ శర్మ (భారత్) – 119
సనత్ జయసూర్య (శ్రీలంక) – 107
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) – 102