IND vs ENG: ఇంగ్లాండ్‌తో సిరీస్ విజయం తరువాత రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. శుభ్‌మ‌న్‌ గిల్, శ్రేయాస్ గురించి మాట్లాడుతూ..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ జట్టు.. తాజాగా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది.

IND vs ENG: ఇంగ్లాండ్‌తో సిరీస్ విజయం తరువాత రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. శుభ్‌మ‌న్‌ గిల్, శ్రేయాస్ గురించి మాట్లాడుతూ..

Rohit Sharma

Updated On : February 10, 2025 / 7:17 AM IST

Rohit Sharma: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ జట్టు.. తాజాగా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్ లలో వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్ జట్టు 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆదివారం రాత్రి కటక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (119 పరుగులు 90 బంతుల్లో, 12 ఫోర్లు, ఏడు సిక్సులు) సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ పూర్తి చేశాడు.

Also Read: IND vs ENG : ఏమ‌య్యా కోహ్లీ ఇది నీకు భావ్య‌మేనా? కుర్రాడికి చోటు లేకుండా చేసి.. సింగిల్ డిజిట్‌కే..

గత కొంత కాలంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ లో విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో రోహిత్ రిటైర్మెంట్ తీసుకోవటం మంచిదన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రోహిత్ సారథ్యంలో ఇటీవల కాలంలో శ్రీలంకలో వన్డే సిరీస్ చేజారింది. సొంతగడ్డపై టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఆస్ట్రేలియాలోనూ టెస్టు సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ లన్నింటిలో రోహిత్ కెప్టెన్ గా, బ్యాటర్ గా విఫలమయ్యాడు. దీంతో అతడు రిటైర్మెంట్ పై వార్తలు ఊపందుకున్నాయి. తాజా.. ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో తన రిటైర్మెంట్ పై మాట్లాడుతున్నవారందరికీ సమాధానం చెప్పాడు. సరియైన సమయంలో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రోహిత్ ఫామ్ పై ఆందోళనలో ఉన్న టీమిండియా అభిమానులు ప్రస్తుతం సెంచరీ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Rohit Sharma : శ‌త‌క్కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. రెండో వ‌న్డేలో ఇంగ్లాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ కైవ‌సం..

వన్డే సిరీస్ ను భారత జట్టు కైవసం చేసుకున్న తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ రోజు బ్యాటింగ్ ను బాగా ఎంజాయ్ చేశాను. జట్టు కోసం నిలబడటం, పరుగులు రాబట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వన్డేల్లో పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. క్రీజులోకి వచ్చినప్పుడే ఎక్కువ సేపు క్రీజులో ఉండి పరుగులు రాబట్టాలని నిర్ణయించుకున్నాను. ఇంగ్లాండ్ బౌలర్లు నా శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బంతులను సంధించారు. అయితే, నా ప్రణాళికలు అమలుపరిచి వారి వ్యూహాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టా’’ అంటూ రోహిత్ చెప్పారు.

Also Read: IND vs ENG : రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. క్రిస్‌గేల్ సిక్స‌ర్ల రికార్డు బ్రేక్‌..

శుభ్ మన్ గిల్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘అతను చాలా క్లాసీ ప్లేయర్. నేను తనని దగ్గరి నుంచి చూశాను. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తాడు. గిల్, శ్రేయాస్ నాకు మద్దతుగా నిలిచారు. మేము బ్యాటింగ్ ను చాలా ఆస్వాదించాం. మిడిల్ ఓవర్లు చాలా కీలకం. ఆ ఓవర్లలో మ్యాచ్ ఎవరైనా గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ ఆ ఓవర్లను మేనేజ్ చేసుకుంటే డెత్ ఓవర్లలో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మొదటి వన్డేలోనూ, రెండో వన్డేలోనూ మిడిల్ ఓవర్లలో మేము చక్కగా బ్యాటింగ్ చేశాము’’ అంటూ రోహిత్ పేర్కొన్నారు.