IND vs ENG : రోహిత్ శర్మ అరుదైన ఘనత.. క్రిస్‌గేల్ సిక్సర్ల రికార్డు బ్రేక్..
వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు.

Rohit Sharma breakes Chris Gayle record
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. కటక్ వేదికగా ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో గుస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో సిక్స్ బాది హిట్‌మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. క్రమంలో అతడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ అధిగమించాడు. 301 మ్యాచ్‌ల్లో గేల్ 331 సిక్సర్లు బాదగా రోహిత్ శర్మ కేవలం 267 మ్యాచ్‌లో 332 సిక్సర్లను కొట్టాడు.
ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది తొలి స్థానంలో ఉన్నాడు. అఫ్రీది 398 మ్యాచ్‌లో 351 వికెట్లు పడగొట్టాడు. వీరి తరువాత జయసూర్య, ధోని తదితరులు ఉన్నారు.
IND vs ENG : సచిన్, ధోని, ద్రవిడ్ ఉన్న టీమ్ఇండియా ఎలైట్ ‘కెప్టెన్ క్లబ్’లోకి రోహిత్ శర్మ..
ROHIT SHARMA OVER-TAKES CHRIS GAYLE 📢
– Rohit becomes the second leading six hitter in ODI history. pic.twitter.com/IQuGjHdqpa
— Johns. (@CricCrazyJohns) February 9, 2025
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు..
షాహిద్ అఫ్రీది (పాకిస్థాన్) – 351 సిక్సర్లు
రోహిత్ శర్మ (భారత్) – 332 సిక్సర్లు
క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 331 సిక్సర్లు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 270 సిక్సర్లు
ఎంఎస్ ధోని (భారత్) – 229 సిక్సర్లు
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) – 220 సిక్సర్లు
Rachin Ravindra : అమ్మబాబోయ్.. క్రికెటర్ కు తీవ్ర గాయం, బంతి ఎంత బలంగా తాకిందో చూడండి..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. బెన్ డకెట్ (65; 56 బంతుల్లో 10 ఫోర్లు), జోరూట్ (69; 72 బంతుల్లో 6 ఫోర్లు) అర్థశతకాలు బాదారు. లియామ్ లివింగ్ స్టోన్ (41), కెప్టెన్ జోస్ బట్లర్ (34), హ్యారీ బ్రూక్ (31), ఫిలిప్ సాల్ట్ (26)లు రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ సాధించారు.
లక్ష్య ఛేదనలో భారత్ 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (29), శుభ్‌మన్ గిల్ (16)లు క్రీజులో ఉన్నారు. భారత విజయానికి 44 ఓవర్లలో ఇంకా 258 పరుగులు అవసరం.