Rachin Ravindra : అమ్మబాబోయ్.. క్రికెటర్ కు తీవ్ర గాయం, బంతి ఎంత బలంగా తాకిందో చూడండి..

రచిన్ రవీంద్ర గాయపడటం కివీస్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం డౌటే అంటున్నారు.

Rachin Ravindra : అమ్మబాబోయ్.. క్రికెటర్ కు తీవ్ర గాయం, బంతి ఎంత బలంగా తాకిందో చూడండి..

Updated On : February 9, 2025 / 1:47 AM IST

Rachin Ravindra : పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కివీస్ ఆల్ రౌండర్ రచిన్‌ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. బాల్ ను క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఈ ఘోరం జరిగింది. బంతి చాలా బలంగా అతడి ముఖాన్ని తాకింది. పాకిస్తాన్‌ బ్యాటర్‌ కుష్‌దిల్‌ షా భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ వద్ద ఉన్న రచిన్‌ బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు.

అయితే, అనూహ్యంగా బంతి రచిన్‌ ముఖానికి బలంగా తాకింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే మెడికల్ సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రమైనది కావడంతో రచిన్ ను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు వల్ల బాల్ సరిగా కనిపించకపోవడంతో ఈ ఘటన జరిగిందట.

Also Read : రోహిత్ శ‌ర్మ తాజా ఫామ్ పై క‌పిల్ దేవ్ కీల‌క వ్యాఖ్య‌లు.. సార‌థే ఇలా ఉంటే..

కాగా, రచిన్ రవీంద్ర గాయపడటం కివీస్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రచిన్‌ ఆడటం డౌటే అంటున్నారు. అదే జరిగితే న్యూజిలాండ్ జట్టుకు ఇది గట్టి దెబ్బే. పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో శనివారం తొలి వన్డే జరిగింది. ఈ ఘటన 37వ ఓవర్ లో చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 78 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. 331 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

2023 వన్డే వరల్డ్ కప్ లో రచిన్ రవీంద్ర అద్భుతంగా రాణించాడు. బ్యాటతో పరుగుల వరద పారించాడు. 10 మ్యాచుల్లో 578 పరుగులు బాదాడు. యావరేజ్ 64.22 కాగా, స్ట్రైక్ రేట్ 106.45గా ఉంది.