Rohit Sharma : రోహిత్ శర్మ తాజా ఫామ్ పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు.. సారథే ఇలా ఉంటే..
రోహిత్ శర్మ తాజా ఫామ్ పై కపిల్ దేవ్ స్పందించాడు.

Kapil dev comments viral on Rohit sharma recent form
గతకొన్నాళ్లుగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమీతో సతమతమవుతున్నాడు. గత పది ఇన్నింగ్స్‌లో (మూడు ఫార్మాట్లు కలిపి) హిట్‌మ్యాన్ వరుసగా.. 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9, 2 పరుగులు మాత్రమే సాధించాడు. చివరిసారిగా 2024 అక్టోబర్ లో రోహిత్ శర్మ అర్థశతకాన్ని సాధించాడు. అప్పటి నుంచి మరోసారి హాఫ్ సెంచరీ మార్క్ ను టచ్ చేయలేదు. దీంతో అతడి పై ప్రస్తుతం విమర్శల జడివాన కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో రెండు పరుగులకు మాత్రమే ఔట్ కావడంతో రిటైర్‌మెంట్ ప్రకటిస్తే మంచిదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ సమయంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఓ సారథి విఫలం అయితే అది జట్టు ప్రదర్శన పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ కపిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ తరువాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు కపిల్ దేవ్. ప్రతి ఒక్క ఆటగాడు ఫామ్‌లోకి రావాలని సూచించాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు.
అయితే రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్ అని, త్వరగానే ఫామ్ అందుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. గెలిచినప్పుడు బ్రహ్మరథం పట్టినవాళ్లే ఓడినప్పుడు విమర్శలు చేస్తారని గుర్తు చేశాడు. ఇక జట్టు కుదురుకునేందుకు కొంత సమయం పడుతుందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి కుదురుకోవాలి. కోచ్‌లకు గుడ్ లక్. దేశం మొత్తం భారత క్రికెట్ జట్టు సాధించే విజయాల కోసం ఎదురుచూస్తుంది. అని చెప్పుకొచ్చాడు.
Suryakumar Yadav : సూర్య భాయ్ మళ్లీ ఫ్లాప్.. ఏముందిలే సర్దుకో ఇక..
ఇక బుమ్రా ఫిట్‌నెస్ ఆందోళనపైనా కపిల్ స్పందించాడు. ఆందోళన అవసరం లేదని, బుమ్రా ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడన్నారు. గత రెండేళ్లుగా మరే ఫాస్ట్ బౌలర్ కూడా ఆటపై ఇంతటి ప్రభావాన్ని చూపలేదన్నాడు. గతంలో అనిల్ కుంబ్లే ఫిట్‌నెస్ సాధించకపోతే ఆ ప్రభావం జట్టు పై పడిందన్నాడు. ఖచ్చితంగా బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.