IND vs ENG : ఏమయ్యా కోహ్లీ ఇది నీకు భావ్యమేనా? కుర్రాడికి చోటు లేకుండా చేసి.. సింగిల్ డిజిట్‌కే..
ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విఫలం అయ్యాడు.

Virat Kohli out just five runs in cuttack match
పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఫ్‌సైడ్ బలహీనతను అధిగమించలేక పదే పదే ఒకే రీతిలో ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తనకు అచ్చొచ్చిన వన్డేల్లో అయినా కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడు అని అంతా భావించారు.
ఇంగ్లాండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో మోకాలి నొప్పితో బరిలోకి దిగలేదు. ఇక కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కోహ్లీ స్థానంలో తొలి వన్డేలో ఆడిన శ్రేయస్ అయ్యర్ అదరగొట్టడంతో అతడిని జట్టులోంచి తీసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో నాగ్‌పూర్ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగ్రేటం చేసిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పై వేటు వేశారు.
Virat Kohli dismissed for 5 in 8 balls. pic.twitter.com/Qf54KqMPTP
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025
అతడి స్థానంలో కోహ్లీ తుది జట్టులోకి వచ్చాడు. 8 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఓ ఫోర్ కొట్టి 5 పరుగులకే ఔట్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పై ప్రస్తుతం విమర్శల జడివాన మొదలైంది. యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Rohit Sharma : హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. దాదాపు 16 నెలల తరువాత వన్డేల్లో రోహిత్ శర్మ శతకం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. బెన్ డకెట్ (65; 56 బంతుల్లో 10 ఫోర్లు), జోరూట్ (69; 72 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ సాధించారు.
అనంతరం రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) శతక్కొట్టగా.. శుభ్‌మన్ గిల్ (60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి 44.3 ఓవర్లలో ఛేదించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్, గుస్ అట్కిన్సన్ తలా ఓ వికెట్ సాధించారు.