Rohit Sharma : హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్‌.. దాదాపు 16 నెల‌ల త‌రువాత వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ శ‌త‌కం..

వ‌న్డేల్లో దాదాపు 16 నెల‌ల త‌రువాత రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేశాడు.

Rohit Sharma : హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్‌.. దాదాపు 16 నెల‌ల త‌రువాత వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ శ‌త‌కం..

Rohit Sharma century in Cuttack odi

Updated On : February 9, 2025 / 8:55 PM IST

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ సెంచ‌రీతో చెల‌రేగాడు. క‌ట‌క్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో కేవ‌లం 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాది మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. వ‌న్డేల్లో రోహిత్‌కు ఇది 32వ శ‌త‌కం. ఇప్ప‌టికే వ‌న్డేల్లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ప్లేయ‌ర్ల జాబితాలో రోహిత్ శ‌ర్మ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఈ జాబితాలో ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 50 శ‌త‌కాల‌తో తొలి స్థానంలో ఉండ‌గా 49 శ‌త‌కాలో దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల‌ర్ రెండో స్థానంలో ఉన్నాడు.

వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్లు వీరే..

విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 50 సెంచ‌రీలు
స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 49 సెంచ‌రీలు
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 32 సెంచ‌రీలు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 30 సెంచ‌రీలు
స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక‌) – 28 సెంచ‌రీలు

IND vs ENG : హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన రోహిత్ శ‌ర్మ‌.. స‌చిన్ రికార్డ్ బ్రేక్‌.. ఇక మిగిలింది సెహ్వాగ్ ఒక్క‌డే..

వన్డేల్లో రోహిత్‌ శర్మ వేగవంతమైన సెంచరీలు (బంతుల్లో..)

అఫ్గానిస్థాన్ పై 63 బంతుల్లో (ఢిల్లీలో) 2023
ఇంగ్లాండ్ పై 76 బంతుల్లో (కటక్‌లో) 2025*
ఇంగ్లాండ్ పై 82 బంతుల్లో (నాటింగ్‌హామ్‌లో) 2018
న్యూజిలాండ్ పై 82 బంతుల్లో(ఇండోర్‌లో) 2023
వెస్టిండీస్ పై 84 బంతుల్లో (గువహటి) 2018

Champions Trophy 2025 : స‌డెన్‌గా చూసి ఐర్లాండ్ జ‌ట్టు అనుకున్నా భ‌య్యా.. ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం పాక్ కొత్త జెర్సీ చూశారా?

ద్రవిడ్ వెన‌క్కు..
తాజా సెంచ‌రీతో రోహిత్‌ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన చేసిన నాలుగో భార‌త బ్యాట‌ర్‌గా రికార్డుకు ఎక్కాడు. ఈ క్ర‌మంలో రాహుల్ ద్ర‌విడ్ ను అధిగ‌మించాడు. ద్ర‌విడ్ 318 ఇన్నింగ్స్‌ల్లో 10,889 ప‌రుగులు చేయ‌గా రోహిత్ శ‌ర్మ 259 ఇన్నింగ్స్‌ల్లో 10,964 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ 18, 426 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత విరాట్ కోహ్లీ, సౌర‌బ్ గంగూలీలు ఉన్నారు.

వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్లు..
స‌చిన్ టెండూల్క‌ర్ – 18426 ప‌రుగులు
విరాట్ కోహ్లీ – 13906 ప‌రుగులు *
సౌర‌వ్ గంగూలీ – 11363 ప‌రుగులు
రోహిత్ శ‌ర్మ – 10964 ప‌రుగులు *
రాహుల్ ద్ర‌విడ్ – 10889 ప‌రుగులు