Champions Trophy 2025 : స‌డెన్‌గా చూసి ఐర్లాండ్ జ‌ట్టు అనుకున్నా భ‌య్యా.. ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం పాక్ కొత్త జెర్సీ చూశారా?

పాకిస్థాన్ ఆట‌గాళ్లు కొత్త జెర్సీ ధ‌రించి ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడ‌నున్నారు.

Champions Trophy 2025 : స‌డెన్‌గా చూసి ఐర్లాండ్ జ‌ట్టు అనుకున్నా భ‌య్యా.. ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం పాక్ కొత్త జెర్సీ చూశారా?

Pakistan new jersey for Champions Trophy 2025Pakistan new jersey for Champions Trophy 2025

Updated On : February 8, 2025 / 10:30 AM IST

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఈ మెగాటోర్నీ మొద‌లు కానుంది. 8 దేశాలు పాల్గొనే ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే.. టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జ‌రుగుతాయి. ఇప్ప‌టికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు త‌మ త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 12 లోపు వాటిల్లో మార్పులు చేర్పుల‌కు అవ‌కాశం ఉంది. కాగా.. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా పాకిస్థాన్ బ‌రిలోకి దిగ‌నుంది.

2017లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌ను ఓడించి పాకిస్థాన్ విజేత‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో మ‌రోసారి టోర్నీ విజేత‌గా నిల‌వాల‌ని ఆరాట‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్లేయ‌ర్ల‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు పీసీబీ సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఆట‌గాళ్లు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నున్నారు. ఈ కొత్త జెర్సీకి సంబంధించిన ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన 15 మంది ప్లేయ‌ర్లు కొత్త జెర్సీలు ధరించి వేదికపై ఫొటోలకు పోజులు ఇచ్చారు.

Champions Trophy 2025 : ఛాంపియ‌న్స్ ట్రోఫీ అఫీషియ‌ల్ సాంగ్ వ‌చ్చేసింది.. మీరు విన్నారా?

ఆట‌గాళ్లు కొత్త జెర్సీలో ఉన్న ఫోటోలు, వీడియోల‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారాయి. కొంద‌రు కొత్త జెర్సీ బాగుంద‌ని కామెంట్లు చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఆ జ‌ట్టు అభిమానులే పాక్ బోర్డును విమ‌ర్శిస్తున్నారు. కొత్త జెర్సీ పాక్ కోసమా లేదా మ‌రో జ‌ట్టు కోస‌మా అంటూ మండిప‌డుతున్నారు. ఐర్లాండ్ జ‌ట్టు జెర్సీ కూడా దాదాపుగా పాకిస్థాన్ కొత్త జెర్సీ లాగానే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఐర్లాండ్ జ‌ట్టు జెర్సీ.. షర్ట్ లేత ఆకుపచ్చ రంగులో ఉంటే, ప్యాంటు  ముదురు ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉంటుంది.

IND vs ENG : శ్రేయ‌స్ అయ్య‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు.. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు.. స‌చిన్, కోహ్లీలకు సాధ్యం కాలేదు..

సయీమ్‌ అయూబ్ దూరం..

ఇదిలా ఉంటే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే ఆ జ‌ట్టు యువ ఓపెన‌ర్ సయీమ్‌ అయూబ్ గాయం కార‌ణంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. ఇటీవ‌ల దక్షిణాఫ్రికాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో అత‌డి చీల‌మండ‌లానికి గాయ‌మైంది. అప్ప‌టి నుంచి అత‌డు ఇంగ్లాండ్‌లో పున‌రావాసంలో ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. ఈ నేప‌థ్యంలో అతడు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. 22 ఏళ్ల ఈ ఎడం చేత వాటం బ్యాట‌ర్ ప్ర‌స్తుతం సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనలలో దుమ్మురేపాడు. భీక‌ర ఫామ్‌లో ఉన్న అయూబ్ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరం కావ‌డం నిజంగానే ఎదురుదెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు.