Rohit Sharma century in Cuttack odi
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీతో చెలరేగాడు. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కేవలం 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు బాది మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 32వ శతకం. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 50 శతకాలతో తొలి స్థానంలో ఉండగా 49 శతకాలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూలర్ రెండో స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో అత్యధిక సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..
విరాట్ కోహ్లీ (భారత్) – 50 సెంచరీలు
సచిన్ టెండూల్కర్ (భారత్) – 49 సెంచరీలు
రోహిత్ శర్మ (భారత్) – 32 సెంచరీలు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 30 సెంచరీలు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 28 సెంచరీలు
Most ODI centuries:
Virat Kohli – 50.
Sachin Tendulkar – 49.
Rohit Sharma – 32*.– THREE OF THE GREATEST OF THIS FORMAT. 🐐 pic.twitter.com/UzLHO47RJ7
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025
వన్డేల్లో రోహిత్ శర్మ వేగవంతమైన సెంచరీలు (బంతుల్లో..)
అఫ్గానిస్థాన్ పై 63 బంతుల్లో (ఢిల్లీలో) 2023
ఇంగ్లాండ్ పై 76 బంతుల్లో (కటక్‌లో) 2025*
ఇంగ్లాండ్ పై 82 బంతుల్లో (నాటింగ్‌హామ్‌లో) 2018
న్యూజిలాండ్ పై 82 బంతుల్లో(ఇండోర్‌లో) 2023
వెస్టిండీస్ పై 84 బంతుల్లో (గువహటి) 2018
ద్రవిడ్ వెనక్కు..
తాజా సెంచరీతో రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుకు ఎక్కాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ ను అధిగమించాడు. ద్రవిడ్ 318 ఇన్నింగ్స్‌ల్లో 10,889 పరుగులు చేయగా రోహిత్ శర్మ 259 ఇన్నింగ్స్‌ల్లో 10,964 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 18, 426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీ, సౌరబ్ గంగూలీలు ఉన్నారు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు..
సచిన్ టెండూల్కర్ – 18426 పరుగులు
విరాట్ కోహ్లీ – 13906 పరుగులు *
సౌరవ్ గంగూలీ – 11363 పరుగులు
రోహిత్ శర్మ – 10964 పరుగులు *
రాహుల్ ద్రవిడ్ – 10889 పరుగులు