England Announce Squad : వరల్డ్ కప్ దెబ్బతో మారిన ప్లేయర్స్.. వెస్టిండీస్‌తో సిరీస్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

ప్రపంచ కప్ లో బట్లర్ సేన ఘోర వైఫల్యంతో వెస్టిండీస్ సిరీస్ కు యువకులకు జట్టులో పెద్దపీట వేశారు. వన్డే సిరీస్ కోసం 15మందితో, టీ20 సిరీస్ కోసం 16 మందితో జట్టును ఇంగ్లాండ్ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు.

England

England Vs West Indies : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గానిస్థాన్ జట్టుకంటే వెనకబడిపోయింది. తొమ్మిది మ్యాచ్ లు ఆడిన ఇంగ్లాండ్ కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధిచింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఏ మాత్రం తమస్థాయికి తగ్గవిధంగా ఆడలేకపోయారు. సెమీస్ కు చేరే అవకాశం లేకపోవటంతో ఆ జట్టు ఇంటిబాట పట్టింది. అయితే.. త్వరలో వెస్టిండీస్ టూర్ కు వెళ్లనుంది. డిసెంబర్ 3 నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. ఈ సిరీస్ లకు సంబంధించిన తాజాగా జట్టును ఇంగ్లాండ్ సెలెక్టర్లు ప్రకటించారు.

Also Read : IND vs NED : టీమ్ఇండియా బ్యాటింగ్‌.. తుది జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..?

ప్రపంచ కప్ లో బట్లర్ సేన ఘోర వైఫల్యంతో వెస్టిండీస్ సిరీస్ కు యువకులకు జట్టులో పెద్దపీట వేశారు. వన్డే సిరీస్ కోసం 15మందితో, టీ20 సిరీస్ కోసం 16 మందితో జట్టును ఇంగ్లాండ్ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. అయితే, భారతదేశంలో ప్రస్తుతం ప్రపంచ కప్ జట్టులో కొనసాగిన వారిలో ఆరుగురు ప్లేయర్స్ ను ఇంగ్లాండ్ సెలెక్టర్లు పక్కన పెట్టారు. మెగా టోర్నీలో విఫలమైన జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్ పై వేటు వేసింది. మోకాలి సర్జరీ కోసం వేచి చూస్తున్న బెన్ స్టోక్స్ ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. రెండు ఫార్మాట్లలో జట్టు కెప్టెన్ గా జోస్ బట్లర్ కే సెలెక్టర్లు బాధ్యతలు అప్పగించారు.

Also Read : ODI World Cup 2023 : భారత్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఏం జరుగుతుందో తెలుసా? ఒకవేళ రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు రద్దైతే?

వ‌న్డే జట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), జాక్ క్రాలే, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హెర్ట్లే, విల్ జాక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, ఓలీపోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ టర్నర్, బ్రాడన్ కర్సే, రెహాన్ అహ్మద్, గ‌స్ అట్కిన్స‌న్.

టీ 20 జట్టు : జోస్ బ‌ట్ల‌ర్(కెప్టెన్), రెహాన్ అహ్మ‌ద్, మోయిన్ అలీ, అట్కిన్స‌న్, హ్యారీ బ్రూక్, సామ్ క‌ర‌న్‌, బెన్ ట‌కెట్, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, టైమ‌ల్ మిల్స్, ఆదిల్ ర‌షీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, రీసే టాప్లే, జాన్ ట‌ర్న‌ర్, క్రిస్ వోక్స్.

 

ట్రెండింగ్ వార్తలు