IND vs NED : టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం..

India vs Netherlands : బెంగ‌ళూరు వేదిక‌గా టీమ్ఇండియా నెద‌ర్లాండ్స్‌తో త‌ల‌ప‌డుతోంది.

IND vs NED : టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం..

IND vs NED

ఇండియా ఘ‌న విజ‌యం..

411 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన నెద‌ర్లాండ్స్ 47.5 ఓవ‌ర్ల‌లో 250 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ 160 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

మూడు వికెట్లు కోల్పోయిన నెద‌ర్లాండ్స్‌
నెద‌ర్లాండ్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. జ‌డేజా బౌలింగ్‌లో మాక్స్‌ ఔడౌడ్ (30; 42 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 15.1వ ఓవ‌ర్‌లో 72 ప‌రుగుల వ‌ద్ద నెద‌ర్లాండ్స్ మూడో వికెట్ కోల్పోయింది. అంత‌క ముందు కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో అకెర్మాన్ (35; 32 బంతుల్లో 6 ఫోర్లు) ఎల్బీగా ఔట్ అయ్యాడు.

10 ఓవ‌ర్ల‌కు నెద‌ర్లాండ్స్ స్కోరు 62/1
భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ఆరంభంలోనే నెద‌ర్లాండ్స్ షాక్ త‌గిలింది. నాలుగు ప‌రుగులు చేసిన వెస్లీ బరేసి జ‌ట్టు స్కోరు 5 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్‌గా ఔట్ అయ్యాడు. అయితే.. మాక్స్‌ ఔడౌడ్ (26), అకెర్మాన్ (32) లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 10 ఓవ‌ర్ల‌కు నెద‌ర్లాండ్స్ స్కోరు 62/1.

నెద‌ర్లాండ్స్ టార్గెట్ 411
భార‌త బ్యాట‌ర్లు దంచికొట్టారు. దీంతో నెద‌ర్లాండ్స్ ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (128 నాటౌట్; 94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (102; 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) శ‌త‌కాలు బాద‌డంతో టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 410 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (61; 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (51; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ల‌తో పాటు వ‌న్ డౌన్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ (51; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో బాస్ డి లీడే రెండు వికెట్లు తీయ‌గా, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ శ‌త‌కం
బాస్ డి లీడే బౌలింగ్‌లో సింగిల్ తీసి శ్రేయ‌స్ అయ్య‌ర్ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 46 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 346/3. కేఎల్ రాహుల్ (70), శ్రేయ‌స్ అయ్య‌ర్ (100) లు ఆడుతున్నారు.

కేఎల్ రాహుల్ అర్ధ‌శ‌త‌కం.. 
వాన్ బీక్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 40 బంతుల్లో కేఎల్ రాహుల్ అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 43 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 312/3. కేఎల్ రాహుల్ (51), శ్రేయ‌స్ అయ్య‌ర్ (86) లు ఆడుతున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీ..
బాస్ డి లీడే బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 48 బంతుల్లో శ్రేయ‌స్ అయ్య‌ర్ అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 34 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 235/3. కేఎల్ రాహుల్ (10), విరాట్ కోహ్లీ (54) లు ఆడుతున్నారు.

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌..
వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 53 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. మ‌రుస‌టి ఓవ‌ర్‌లో వాన్ డెర్ మెర్వే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు కోహ్లీ (51; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌). దీంతో 28.4వ ఓవ‌ర్‌లో 200 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ ఔట్‌..
బాస్ డి లీడే బౌలింగ్‌లో బర్రేసి క్యాచ్ అందుకోవ‌డంతో రోహిత్ శ‌ర్మ (61; 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో బార‌త్ 17.4వ ఓవ‌ర్‌లో 129 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ
వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 44 బంతుల్లో రోహిత్ శ‌ర్మ అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 14 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 109/1. రోహిత్ శ‌ర్మ (52), విరాట్ కోహ్లీ (3) లు ఆడుతున్నారు.

గిల్ హాప్ సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌..
వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో (11.1వ ఓవ‌ర్‌లో) సింగిల్ తీసి శుభ్ మ‌న్ గిల్ 30 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవ‌ర్‌లోని ఐదో బంతికి తేజా నిడ‌మ‌నూరు క్యాచ్ అందుకోవ‌డంతో గిల్ (51 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. 12 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 100/1. రోహిత్ శ‌ర్మ (46), విరాట్ కోహ్లీ (0) లు ఆడుతున్నారు.

5 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 37/0
టాస్ గెలిచి భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 37/0. రోహిత్ శ‌ర్మ (25), శుభ్‌మ‌న్ గిల్ (10) లు ఆడుతున్నారు.

భారత తుది జ‌ట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్ తుది జ‌ట్టు : వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్‌), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్

టాస్ గెలిచిన టీమ్ఇండియా

టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భార‌త తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు.

స్వదేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ సేన వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఎనిమిది విజ‌యాలు సాధించి ఇప్ప‌టికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. లీగ్ ద‌శ‌లో నెద‌ర్లాండ్స్‌తో త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా సెమీ పైన‌ల్‌లో అడుగుపెట్టాల‌ని రోహిత్ సేన భావిస్తోంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ప‌రుగుల వ‌ర‌ద పారే పిచ్ పై టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌ను డ‌చ్ జ‌ట్టు ఎలా అడ్డుకుంటుందో చూడాల్సిందే.