Pakistan vs England 1st Test
Pakistan vs England 1st Test : స్వదేశంలో పాకిస్థాన్ జట్టుకు దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఇటీవల పాక్ గడ్డపై ఆ జట్టును ఓడించి బంగ్లాదేశ్ జట్టు టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్టులోనూ పాక్ ఓడిపోయింది. తద్వారా 147ఏళ్ల టెస్టు చరిత్రలోనే నిలిచిపోయేంత చెత్త రికార్డును పాకిస్థాన్ తన ఖాతాలో వేసుకుంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది.
Also Read: IND vs NZ: భారత్‌ను హెచ్చరించిన న్యూజిలాండ్.. రోహిత్ టీంకు కష్టాలు పెరిగినట్లేనా!
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్ లు సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్ 556 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 249కు మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో 500 పరుగుల కంటే తక్కువ స్కోరుకు ఇంగ్లాండ్ ఆలౌట్ అవుతుందని అందరూ భావించారు. కానీ, జోరూట్, హ్యరీ బ్రూక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. ఒకరు డబుల్ సెంచరీ, మరొకరు త్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డారు. దీంతో వారిద్దరూ కలిసి 454 పరుగులు చేశారు. రూట్ 262 పరుగులు చేయగా.. బ్రూక్ 317 పరుగుల చేసి తన కెరీర్ లో తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 823 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి 267 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది.
రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు 59 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరింది. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసిన పాకిస్థాన్.. ఐదోరోజు కేవలం 68 పరుగులు చేసి 220పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 500కిపైగా పరుగులు చేసిన జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
THE HISTORIC MOMENT….!!!!
– England becomes the first team to win a Test match by an innings after conceding more than 500 runs in the first innings. 🤯👏pic.twitter.com/7Irp3QMI6z
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024