T20 World Cup 2024 : టీ20ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు షాక్.. టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పాక్ కెప్టెన్..
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌కు జట్టుకు షాక్ తగిలింది.

Fatima Sana To Return To Pakistan From T20 World Cup After Fathers Demise
T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌కు జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా టీ20 ప్రపంచకప్ మధ్యలోనే స్వదేశానికి పయమైనమైంది. ఆమె తండ్రి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఫాతిమా దుబాయ్ నుంచి కరాచీకి పయనం అయినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌కు ఆమె దూరమైంది.
ఫాతిమా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ మునీబా అలీ పాక్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ మెగాటోర్నీలో రెండు మ్యాచులు ఆడిన పాకిస్థాన్ ఓ మ్యాచులో గెలవగా మరో మ్యాచులో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Rafael Nadal : అభిమానులకు షాకిచ్చిన రఫెల్ నాదల్.. డేవిస్ కప్ తరువాత ఆటకు వీడ్కోలు
గ్రూపు దశలో పాకిస్థాన్ ఇంకో రెండు మ్యాచులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఫాతిమా జట్టుకు దూరం కావడం పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆమె మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫాతిమా సనా బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.