ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. శ‌నివారం జ‌ట్టును ప్ర‌క‌టించ‌నున్న బీసీసీఐ!

ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించే భార‌త జ‌ట్టులో ఎవ‌రెవ‌రు చోటు ద‌క్కించుకుంటారో అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

England tour of india Test squad to be announced on May 24 report

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డంతో వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంది. కెప్టెన్‌గా ఎవ‌రిని నియ‌మిస్తారు? రోహిత్‌, విరాట్ స్థానాల్లో ఎవ‌రికి ఎంపిక చేస్తారు? సీనియ‌ర్ ఆట‌గాళ్లు పుజారా, ర‌హానేల‌కు తీసుకుంటారా? లేదంటే కుర్రాళ్ల‌కే పెద్ద పీట వేస్తారా? అన్న ఉత్కంఠ అంద‌రిలో ఉంది.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు నెల‌రోజుల కంటే త‌క్కువ స‌మ‌య‌మే ఉండ‌డంతో జ‌ట్టును ఎప్పుడు ఎంపిక చేస్తారు అన్న ప్ర‌శ్న అంద‌రిలో ఉంది. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించే భార‌త జ‌ట్టును మే 24 (శనివారం) ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. టీమ్ ఇండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్, సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ లు సంయుక్తంగా మీడియా స‌మావేశం నిర్వ‌హించి జ‌ట్టును వెల్ల‌డించే అవ‌కాశం ఉందని హిందుస్థాన్ టైమ్స్ వ‌ర్గాలు తెలిపాయి.

GT : ల‌క్నో చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్‌కు కొత్త క‌ష్టం.. గిల్ ఇప్పుడేం చేస్తాడో.. ఆనందంలో ఆర్‌సీబీ, పంజాబ్ జ‌ట్లు..

‘జట్టు సిద్ధంగా ఉంది. ప్రధాన కోచ్, చీఫ్ సెలెక్టర్ శనివారం ప్రకటిస్తారు.’ అని BCCI అధికారి ఒక‌రు తెలిపిన‌ట్లు పేర్కొంది.

కెప్టెన్సీ రేసులో గిల్‌..
ప్రస్తుతం టీమ్ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌ రేసులో శుభ్‌మన్‌ గిల్ అంద‌రి క‌న్నా ముందున్నాడు. అయితే.. సీనియ‌ర్ ఆట‌గాళ్లు జస్ప్రీత్‌ బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ సైతం రేసులో ఉన్నారు. వీరిలో కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అందుకునేది ఎవ‌రు అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంది.

ఇక గాయం కార‌ణంగా దాదాపు రెండు సంవ‌త్స‌రాలుగా సుదీర్ఘ ఫార్మాట్ కు దూరం అయిన‌ మ‌హ్మ‌ద్ ష‌మీ రీ ఎంట్రీ ఇస్తాడా? లేదా చూడాల్సిందే.

Joe Root : జోరూట్ మామూలోడు కాదురా అయ్యా.. కొడితే స‌చిన్‌, ద్రవిడ్‌, క‌లిస్‌, పాంటింగ్ రికార్డులు బ్రేక్‌..

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. జూన్ 20న హెడింగ్లీ వేదిక‌గా జ‌రిగే తొలి టెస్టు మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది.

భార‌త్‌, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..

తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్‌ 24 వ‌ర‌కు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వ‌ర‌కు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వ‌ర‌కు – లార్డ్స్‌
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వ‌ర‌కు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు – కెన్నింగ్టన్ ఓవల్

GT vs LSG : గుజ‌రాత్ పై విజ‌యం.. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ కామెంట్స్ వైర‌ల్‌.. గ‌తంలో ప్లేఆఫ్స్‌కు ఛాన్స్ ఉండేది.. కానీ