GT vs LSG : గుజరాత్ పై విజయం.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్.. గతంలో ప్లేఆఫ్స్‌కు ఛాన్స్ ఉండేది.. కానీ
గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించిన తరువాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ నుంచి నిష్ర్కమించిన తరువాత లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది.
మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 పరుగులు), రిషబ్ పంత్ (6 బంతుల్లో 16 పరుగులు) లు వేగంగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్, అర్షద్ ఖాన్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
GT vs LSG : లక్నో పై ఓటమి.. గుజరాత్ కెప్టెన్ గిల్ కామెంట్స్.. ప్లేఆఫ్స్‌కు ముందు..
ఆ తరువాత లక్ష్య ఛేదనలో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో షారుక్ ఖాన్ (57) హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్‌మన్ గిల్ (35), జోస్ బట్లర్ (33), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (38) లు పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్క్ మూడు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, ఆయుష్ బదోని లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆకాష్ మహారాజ్ సింగ్, షాబాజ్ అహ్మద్ లు చెరో వికెట్ సాధించారు.
గుజరాత్ పై విజయం సాధించడం పట్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఓ జట్టుగా తాము మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించామని చెప్పుకొచ్చాడు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు గతంలో ఉండేవని, అయితే.. ఇలాంటి అన్ని సహజం అని అన్నాడు. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలన్నాడు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లు అద్భుతంగా ఆడారని అన్నాడు. ఇక ఫీల్డింగ్‌లో తాము కొన్ని తప్పిదాలు చేశామన్నాడు. ఈ విభాగంలో తాము మరికొంత మెరుగు కావాల్సి ఉందన్నాడు.