Joe Root : జోరూట్ మామూలోడు కాదురా అయ్యా.. కొడితే సచిన్, ద్రవిడ్, కలిస్, పాంటింగ్ రికార్డులు బ్రేక్..
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు.

Joe Root Becomes Fastest Batter To Score 13000 Runs In Tests
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 13వేల పరుగుల మైలురాయిని సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టైస్టు మ్యాచ్‌లో 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూట్ ఈ ఘనతను సాధించాడు.
ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్, జాక్వెస్ కలిస్‌లను అధిగమించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు జాక్వస్ కలిస్ పేరిట ఉండేది. 159 మ్యాచ్‌ల్లో కలిస్ ఈ మైలురాయిని చేరుకోగా.. జోరూట్ 153 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
RCB : ప్లేఆఫ్స్‌కు ముందు గుడ్‌న్యూస్.. ఆర్‌సీబీ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..
టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
జో రూట్ – 153 మ్యాచ్‌లు
జాక్వెస్ కలిస్ – 159 మ్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ – 160 మ్యాచ్‌లు
రికీ పాంటింగ్ – 162 మ్యాచ్‌లు
సచిన్ టెండూల్కర్ – 163 మ్యాచ్‌లు
టెస్టుల్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ క్రికెటర్ కూడా జో రూట్‌నే కావడం విశేషం.
ఇక ఈ మ్యాచ్ విషయానికి టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(169), హ్యారీ బ్రూక్(9) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ (124), బెన్ డకెట్ (140) లు సెంచరీలతో చెలరేగారు. రూట్ 34 పరుగులు సాధించాడు.