IND vs ENG : ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వైభవ్ సూర్యవంశీకి చోటు, కెప్టెన్‌గా ధోని శిష్యుడు..
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది.

BCCI announces Indias U-19 squad for England tour
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టును జూనియర్ క్రికెట్ కమిటీ ఎంపిక చేసింది. కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే ను ఎంపిక చేశారు. అతడికి డిప్యూటీగా అభిజ్ఞాన్ కుందు వ్యవహరించనున్నాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అండర్-19 జట్టు ఐదు వన్డేలు, రెండు మల్టీ- డే మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 24న పర్యటన ఆరంభం కానుండగా జూలై 23 ముగుస్తుంది.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
India U19 squad for Tour of England announced.
Details 🔽
— BCCI (@BCCI) May 22, 2025
ఈ జట్టులో ఆయుష్, వైభవ్‌లపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఎలా రాణిస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్‌లో సూర్యవంశీ ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఆయుష్ మాత్రే ఆరు మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టు ఇదే..
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్‌వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్‌ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్‌జీత్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్లు : నమన్ పుష్కక్, డి దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).
భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్-19 షెడ్యూల్ ఇదే..
* జూన్ 24న 50 ఓవర్ల వార్మప్ గేమ్ – లోబోరో యూనివర్సిటీ
* జూన్ 27న మొదటి వన్డే – హోవ్
* జూన్ 30న రెండో వన్డే – నార్తాంప్టన్
* జూలై 2న మూడో వన్డే – నార్తాంప్టన్
* జూలై 5న నాలుగో వన్డే – వోర్సెస్టర్
* జూలై 7న ఐదో వన్డే – వోర్సెస్టర్
* జూలై 12న తొలి మల్టీ డే మ్యాచ్ – బెకింగ్‌హామ్
* జూలై 20న రెండో మల్టీ డే మ్యాచ్ – చెమ్స్‌ఫోర్డ్