Nita Ambani : మ్యాచ్ గెలిచాక ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వస్తే.. నీతా అంబానీ ఏం చేశారో చూడండి..
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nita Ambani distributing sanitizers to players before handshake after Mumbai Indians beat DC
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై ప్లేయర్లు.. ఓనర్ నీతా అంబానీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆటగాళ్లకు నీతా అంబానీ కోవిడ్ ప్రోటోకాల్‌ను గుర్తు చేశారు.
Nita Ambani asking Jasprit Bumrah to sanitise his hands 😄#MIvsDC #MIvDC pic.twitter.com/fjmd5MbwE1
— Cricketism (@MidnightMusinng) May 21, 2025
సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, రోహిత్ శర్మలతో పాటు మిగిలిన ఆటగాళ్లందరికి ఆమె స్వయంగా శానిటైజర్‌ను అందించారు. చేతులను శుభ్రం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇక ఆటగాళ్లు కూడా తమ చేతులను శుభ్రం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తమ ఆటగాళ్లను ఆమె ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారతదేశంలోని కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి వివిధ ప్రాంతాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 250 కి పైగా యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి.
ఇక మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. బుమ్రా, సాంట్నర్ లు జట్టులో ఉండడం తనకు చాలా కలిసి వస్తుందన్నాడు. వారు అద్భుతమైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తారని అన్నాడు. ‘మొదట ఈ వికెట్ పై 180 పరుగులు చేస్తే బాగుంటుందని అనుకున్నాం.. అయితే వికెట్లు కోల్పోవడంతో 160 పరుగులు చేసినా చాలు అని అనుకున్నం. కానీ.. సూర్య, నమన్ ధీర్ అద్భుత బ్యాటింగ్‌తో మేం అనుకున్న స్కోరును సాధించారు.’ అని హార్దిక్ అన్నాడు.
LSG : ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్.. ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్..
Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025