Suryakumar Yadav : చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. టీ20 క్రికెట్‌లో ఆసియాలోనే ఒకే ఒక్కడు.. టెంబా బవుమా అద్భుత రికార్డు సమం..
టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.

Courtesy BCCI
టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో వరుసగా 13 మ్యాచ్‌ల్లో 25 కంటే ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలవడంతో ఈ ఘనత అందుకున్నాడు.
ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు టెంబా బవుమా రికార్డును సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. బవుమా సైతం టీ20 క్రికెట్‌లో వరుసగా 13 మ్యాచ్‌ల్లో 25 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. కాగా.. ఈ ఫీట్ సాధించిన తొలి ఆసియా ఆటగాడిగా సూర్య రికార్డులకు ఎక్కాడు.
టీ20 క్రికెట్‌లో వరుసగా అత్యధిక సార్లు 25+రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
సూర్యకుమార్ యాదవ్ – 13 సార్లు
టెంబా బవుమా – 13 సార్లు
బ్రాడ్ హాడ్జ్ – 11 సార్లు
జాక్వెస్ రుడాల్ఫ్ – 11 సార్లు
కుమార సంగక్కర -11 సార్లు
క్రిస్ లిన్ -11 సార్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. చమీర, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
LSG : ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్.. ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్..
అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ విఫలమైంది. 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (39), విప్రజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11)లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ చెరో మూడు వికెట్లు తీశారు. బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కొ వికెట్ సాధించారు. ఈ విజయంలో ముంబై జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.