LSG : ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్.. ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. రిషబ్ పంత్ నాయకత్వంలో ఈ సీజన్‌లో బరిలోకి దిగిన లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇది ఏడో పరాజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65 పరుగులు), ఐడెన్ మార్‌క్రమ్ (38 బంతుల్లో 61 పరుగులు) హాప్ సెంచరీలు బాదారు. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 45 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59 పరుగులు), హెన్రిచ్ క్లాస్ (28 బంతుల్లో 47 పరుగులు), ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 35 పరుగులు) రాణించడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. లక్నో బౌలర్లలోదిగ్వేష్ రాఠి రెండు వికెట్లు పడగొట్టాడు.
సంజీవ్ గొయెంకా స్పందన ఇదే..
లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఈ సీజన్‌లో రెండవ అర్ధభాగం సవాలుతో కూడుకున్నదన్నాడు. స్ఫూర్తి, కృషి, అద్భుతమైన క్షణాలు మరింతగా ముందుకు సాగడానికి ప్రేరణ ఇస్తాయని చెప్పాడు. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గర్వంగా ఆడి బలంగా పూర్తి చేద్దాం. అని సంజీవ్ అన్నాడు.
Digvesh Rathi : లక్నో స్టార్ స్పిన్నర్ దిగ్వేశ్ కు బీసీసీఐ భారీ షాక్.. ఓ మ్యాచ్ సస్పెన్షన్..
గొయెంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
It’s been a challenging second half of the season, but there’s much to take heart in. The spirit, the effort, and the moments of excellence give us a lot to build on. Two games remain. Let’s play with pride and finish strong. #LSGvsSRH pic.twitter.com/gFzyddlnMn
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 20, 2025