Mumbai Indians : ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టకముందే టైటిల్ కొట్టేందుకు ముంబై మాస్టర్ ప్లాన్.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు..
ముంబై ఇండియన్స్ జట్లు ముగ్గురు ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంది.

pic cridt @ MI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లీగ్ దశ ముగింపుకు వచ్చింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌లు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడుతున్నాయి.
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా.. ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +1.156గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్ దశలో ముంబై మరో రెండు (మే 21న ఢిల్లీ, మే 26న పంజాబ్ కింగ్స్‌తో) ఆడనుంది.
RR vs CSK : ఐపీఎల్ 2025 సీజన్‌లో వైభవ్ సూర్య వంశీ ఆఖరి మ్యాచ్.. ధోని సమక్షంలో..
ఇందులో మే 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే.. 16 పాయింట్లతో ముంబై ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.
అయితే.. ముంబై కీలక ఆటగాళ్లు విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్ లు లీగ్ దశ వరకే అందుబాటులో ఉంటారు. ఈ ముగ్గరు ఆటగాళ్లు తమ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు ఐపీఎల్‌ను వీడనున్నారు. దీంతో ప్లేఆఫ్స్‌కు ఈ ముగ్గురు అందుబాటులో ఉండరు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గరి స్థానాల్లో జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకలను ముంబై తీసుకుంది.
📰 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐬𝐢𝐠𝐧 𝐉𝐨𝐧𝐧𝐲 𝐁𝐚𝐢𝐫𝐬𝐭𝐨𝐰, 𝐂𝐡𝐚𝐫𝐢𝐭𝐡 𝐀𝐬𝐚𝐥𝐚𝐧𝐤𝐚 𝐚𝐧𝐝 𝐑𝐢𝐜𝐡𝐚𝐫𝐝 𝐆𝐥𝐞𝐞𝐬𝐨𝐧 💙
Read more ➡ https://t.co/ElbI4MeVBE#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/6vyC8FmW3d
— Mumbai Indians (@mipaltan) May 20, 2025
ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ముంబై ప్లేఆఫ్స్‌లో అడుగుపెడితే.. ఈ ముగ్గురు ఆడతారని చెప్పింది. ఇందులో జానీ బెయిర్ స్టోను రూ.5.25 కోట్లకు, రిచర్డ్ గ్లీసన్ రూ. కోటికి, చరిత్ అసలంకను బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Digvesh Rathi : లక్నో స్టార్ స్పిన్నర్ దిగ్వేశ్ కు బీసీసీఐ భారీ షాక్.. ఓ మ్యాచ్ సస్పెన్షన్..
ఇదిలా ఉంటే.. ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఓడిపోతే అప్పుడు కూడా హార్దిక్ సేనకు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. మే 24న ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించాలి. అదే సమయంలో మే26న పంజాబ్ పై ముంబై గెలవాలి. అప్పుడు హార్దిక్ సేన ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.