RR vs CSK : ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో వైభ‌వ్ సూర్య వంశీ ఆఖ‌రి మ్యాచ్‌.. ధోని స‌మ‌క్షంలో..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌న చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది.

RR vs CSK : ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో వైభ‌వ్ సూర్య వంశీ ఆఖ‌రి మ్యాచ్‌.. ధోని స‌మ‌క్షంలో..

MS Dhoni vs Vaibhav Suryavanshi

Updated On : May 20, 2025 / 11:48 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌న చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. మంగ‌ళ‌వారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ఈ రెండు జ‌ట్లు కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్ 13 మ్యాచ్‌లు ఆడింది. కేవ‌లం మూడు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ -0.701గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో ఓడిపోతే ప‌దో స్థానానికి ప‌డిపోతుంది. ఈ క్ర‌మంలో ఆఖ‌రి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజ‌న్‌ను కాస్త సంతృప్తితో ముగించాల‌ని ఆర్ఆర్ భావిస్తోంది.

Digvesh Rathi : ల‌క్నో స్టార్ స్పిన్న‌ర్ దిగ్వేశ్ కు బీసీసీఐ భారీ షాక్‌.. ఓ మ్యాచ్ సస్పెన్షన్‌..

మ‌రోవైపు చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టి వ‌రకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేట్ -0.992గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో ఉంది. రాజ‌స్థాన్‌పై విజ‌యం సాధించి ఓ స్థానాన్ని అయినా మెరుగుప‌ర‌చుకోవాల‌ని చెన్నై భావిస్తోంది.

కాగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం ఆవిషృతం కానుంది. ఈ టోర్నీలో అతి పెద్ద వ‌య‌స్కుడైన ఆట‌గాడిగా ఉన్న ధోని, అతి పిన్న‌వ‌య‌స్కుడైన ఆట‌గాడిగా సూర్య‌వంశీతో త‌ల‌ప‌డ‌నున్నాడు.

Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్‌కు గోల్డెన్ ఛాన్స్‌.. ఈజీగా ప్లేఆఫ్స్‌కు

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లోనే ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన 14 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి ఇది ఏడో మ్యాచ్ కానుంది. చెన్నైతో మ్యాచ్‌లో ఓ మంచి ఇన్నింగ్స్ ఆడి తొలి సీజ‌న్‌ను ఘ‌నంగా ముగించాల‌ని ఈ 14 ఏళ్ల ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు ఆరాట‌ప‌డుతున్నాడు. ఇక‌ ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచ్‌ల్లో వైభ‌వ్ 32.50 స‌గ‌టు 219.10 స్ట్రైక్‌రేటుతో 195 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచ‌రీ ఉంది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై, రాజ‌స్థాన్‌ జ‌ట్లు 31 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 16 మ్యాచ్‌ల్లో చెన్నై విజ‌యం సాధించ‌గా 15 మ్యాచ్‌ల్లో రాజ‌స్థాన్ గెలుపొందింది.

LSG vs SRH : ఐపీఎల్ 2025 నుంచి ల‌క్నో ఔట్.. కెప్టెన్ రిష‌బ్ పంత్ కీల‌క వ్యాఖ్య‌లు.. దాని గురించి మాట్లాడొద్దని..