Mumbai Indians : ముంబై ఇండియన్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఈజీగా ప్లేఆఫ్స్‌కు
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరుకునేందుకు మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడుతున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ ఆఖరి దశకు చేరుకుంటోంది. గుజరాత్ టైటాన్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం సోమవారం ఉదయం వరకు మూడు జట్లు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. అయితే.. సోమవారం రాత్రి ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. దీంతో లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.
ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యే పోటీ నెలకొని ఉంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా అని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
BAN vs UAE : బంగాదేశ్ ఇజ్జత్ పాయె..! పసికూన చేతిలో ఓటమి..
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +1.156గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.260గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఒక్క అడుగుదూరంలో ముంబై..
లీగ్ దశలో ముంబై, ఢిల్లీలు చెరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక లీగ్ మ్యాచ్ ఇరు జట్ల మధ్య జరగనుంది.
బుధవారం (మే 21న) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీక్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గనుక ముంబై విజయం సాధిస్తే అప్పుడు 16 పాయింట్లతో హార్దిక్ సేన ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఎందుకంటేఢిల్లీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించినా 15 పాయింట్లే ఆ జట్టు ఖాతాలో ఉంటాయి
ఒకవేళ ముంబై పై ఢిల్లీ గెలిస్తే మాత్రం ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారనుంది. అప్పుడు పంజాబ్ కింగ్స్‌తో ఇరు జట్లు (మే 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 26న ముంబై ఇండియన్స్) ఆడనున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లు కీలకంగా మారుతాయి.
ముంబై, పంజాబ్ లపై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది.
ఢిల్లీ పై ముంబై ఓడిపోతే..
ఢిల్లీ చేతిలో ముంబై ఓడితే.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ పై హార్దిక్ సేన గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓడిపోవాలి. అప్పుడు ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.