IPL 2025: ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. అతను ఉండిఉంటే ఫలితం వేరేలా ఉండేది.. ఢిల్లీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కీలక కామెంట్స్..

ముంబై ఇండియన్స్ పై ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలను వివరించారు.

IPL 2025: ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. అతను ఉండిఉంటే ఫలితం వేరేలా ఉండేది.. ఢిల్లీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కీలక కామెంట్స్..

IPL 2025

Updated On : May 22, 2025 / 8:13 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాటం ముగిసింది. ప్లేఆప్స్ లోకి అడుగుపెట్టేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ జట్టు చేజార్చుకుంది. బౌలింగ్ లో అదరగొట్టినా.. ఆ జట్టు బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ పై 59 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలను వివరించారు.

Also Read: IPL 2025: కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చిత్తు.. ప్లే‌ ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్.. ఆ మూడు జట్ల సరసన

‘‘మా జట్టు కుర్రాళ్లు గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారు. బ్యాటింగ్ చేయడానికి ఇది అంత సులువైన పిచ్ కాదు. మొదటి నుంచి మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, చివరి రెండు ఓవర్లలోనే మేము మ్యాచ్ పై పట్టు కోల్పోయాం. ఆ రెండు ఓవర్లు మా 18 ఓవర్ల అద్భుతమైన ఆటను నాశనం చేశాయి. మేము బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. సమీర్ రిజ్వీ అద్భుతంగా ఆడాడు. అతనిలో ప్రతిభ ఉంది. గత ఏడెనిమిది మ్యాచ్ లలో మేము బ్యాటింగ్, బౌలింగ్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతోనే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేదు.’’

 

అక్షర్ పటేల్ ఉండిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఈ వికెట్ పై అక్షర్ పటేల్ మంచిగా సెట్ అవుతాడు. ముంబై స్పిన్నర్ మిచెట్ శాంట్నర్ బౌలింగ్ చేసిన తీరుతో ఈ విషయం స్పష్టంగా తెలిసొచ్చింది. ఇలాంటి వికెట్ పై అక్షర్ సత్తాచాటేవాడు. కానీ, అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మిచెల్ స్టార్క్ కూడా అద్భుతమైన బౌలర్. కానీ, ముఖ్యంగా ఇలాంటి వికెట్ పై స్పిన్నర్ చాలా విలువైన ప్లేయర్. క్రికెట్‌లో మూమెంటమ్‌ను ఎప్పుడూ లైట్ తీస్కోవద్దు. చివరి రెండు మ్యాచ్‌ల్లో మూమెంటమ్ అందుకోవడానికి మేం బాగా పోరాడాం. అగ్రస్థానంలో ఉన్నప్పుడు అస్సలు మూమెంటమ్ కోల్పోకూడదంటూ ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరగా.. తాజాగా.. ఢిల్లీపై విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టింది.