IPL 2025: కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చిత్తు.. ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్.. ఆ మూడు జట్ల సరసన
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది.

Mumbai Indians
IPL 2025: ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. టపటపా వికెట్లు కోల్పోయారు. దీంతో 18.2 ఓవర్లలోనే ఆ జట్టు ఆలౌట్ అయింది.
ఐపీఎల్ లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ప్లే ఆఫ్స్ లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్) అద్భుత బ్యాటింగ్ చేసి ముంబై విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలుత కట్టుదిట్టమైన బంతులతో ఢిల్లీ బౌలర్లు బౌలింగ్ చేశారు. దీంతో 18 ఓవర్లకు ముంబై స్కోర్ 132/5 మాత్రమే. దీంతో కనీసం 160 పరుగులైనా చేస్తుందా అని అందరూ భావిస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. అతనికి నమన్ ధీర్ (8బంతుల్లో 24నాటౌట్) తోడు కావడంతో కేవలం రెండు ఓవర్లలోనే 48 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది.
భారీ పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో ఢిల్లీ బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. ముఖ్యంగా మిచెల్ శాన్ ట్నర్, జస్ర్పీత్ బుమ్రాలు అద్భుత బౌలింగ్ తో చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సమీర్ రిజ్వి (39), విప్రాజ్ నిగమ్ (20) పరుగులు మినహా మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్ కు వెళ్లిపోయారు.
ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరగా.. తాజాగా.. ఢిల్లీపై విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టింది.
ONE OF THE MOST ICONIC MATCHES:
DC before this match – 4 wins, 0 loss.
MI before this match – 1 wins, 4 loss.pic.twitter.com/I5RYGgdNTM
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2025
IPL 2025 POINTS TABLE. 📈
– The battle of the Top 2 begins! 🔥 pic.twitter.com/cHUAr7gZFI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2025