IPL 2025: వైభవ్ వీర విహారం.. ఫోర్లు, సిక్సర్లతో దడదడలాడించిన యంగ్ ప్లేయర్.. చివరిలో ధోనీ కాళ్లకు నమస్కారం చేస్తూ..

వైభవ్ సూర్యవంశీ మరోసారి వీరవిహారం చేశాడు. అద్భుత బ్యాటింగ్ తో కేవలం 27 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు

IPL 2025: వైభవ్ వీర విహారం.. ఫోర్లు, సిక్సర్లతో దడదడలాడించిన యంగ్ ప్లేయర్.. చివరిలో ధోనీ కాళ్లకు నమస్కారం చేస్తూ..

Vaibhav Suryavanshi,

Updated On : May 21, 2025 / 7:38 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా మంగళవారం రాత్రి అరున్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆర్ఆర్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్లు కేవలం 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 188 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, రాజస్థాన్ జట్లు విజయంలో యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ కీలక భూమిక పోషించాడు.

Also Read: IPL 2025: రాజస్థాన్‌పై ఓటమి తరువాత మహేంద్రసింగ్ ధోనీ ఆసక్తికర కామెంట్స్.. యువ ప్లేయర్లకు కీలక సూచనలు

వైభవ్ సూర్యవంశీ మరోసారి వీరవిహారం చేశాడు. అద్భుత బ్యాటింగ్ తో కేవలం 27 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 33 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఇందులో నాలు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. తొలుత తన శైలికి విరుద్దంగా ఆచితూచి ఆడిన వైభవ్.. స్పిన్నర్ నూర్ వేసిన బౌలింగ్ లో 6, 4, 4 వరుస బౌండరీలతో టాప్ గేర్ అందుకున్నాడు. ఆ తరువాత అతణ్ని ఆపడం చెన్నై బౌలర్ల వల్ల కాలేదు. 14వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వైభవ్ ఔట్ అయ్యాడు. అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్ (41), వైభవ్ లను పెవిలియన్ బాటపట్టించాడు.

 

చివరిలో వైభవ్ సూర్యవంశీ మహేంద్ర సింగ్ ధోనీ కాళ్లకు నమస్కారం చేశాడు. మ్యాచ్ అనంతరం ఇరు జట్లు మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో ధోనీ కాళ్లకు వైభవ్ సూర్యవంశీ నమస్కరించాడు. ధోనీ అతన్ని వారిస్తూ.. అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్ అంటూ అభినందించాడు. గతంలోనూ యంగ్ ప్లేయర్ ధోనీ దగ్గరకు రాగా వంగి కాళ్లకు నమస్కారం చేశారు. అయితే, ప్రస్తుతంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.