MI vs DC : ఢిల్లీతో మ్యాచ్‌లో ఓ నిబంధ‌న‌ను అతిక్ర‌మించిన‌ ముంబై.. ఫీల్డ్ అంపైర్ గ‌మ‌నించి ఏం చేశాడంటే..?

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఓ నిబంధ‌న‌ను అతిక్ర‌మించింది.

MI vs DC : ఢిల్లీతో మ్యాచ్‌లో ఓ నిబంధ‌న‌ను అతిక్ర‌మించిన‌ ముంబై.. ఫీల్డ్ అంపైర్ గ‌మ‌నించి ఏం చేశాడంటే..?

Courtesy BCCI

Updated On : May 22, 2025 / 12:17 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. బుధ‌వారం వాంఖ‌డే వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్లేఆఫ్స్‌లో ముంబై అడుగుపెట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఓ నిబంధ‌న‌ను అతిక్ర‌మించింది. దీన్ని గ‌మ‌నించిన అంపైర్ వెంట‌నే.. ఆ బంతిని నోబాల్‌గా ప్ర‌క‌టించాడు.

అస‌లేం జ‌రిగిందంటే..
ఢిల్లీ ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను విల్ జాక్స్ వేశాడు. ఢిల్లీ బ్యాట‌ర్ విప్రాజ్ నిగ‌మ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఓవ‌ర్‌లోని మూడో బంతిని వేయ‌గా దాన్ని నిగ‌మ్ ఆడాడు. అయితే.. ఆ బాల్‌ను అంపైర్ నోబాల్‌గా ప్ర‌క‌టించాడు.

PAK vs BAN : అరెరె.. ఈ సీనియ‌ర్ త్ర‌యానికి షాక్ ఇచ్చిన పాక్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు డౌటేనా?

ఎందుకంటే ఆ స‌మ‌యంలో ఆఫ్‌సైడ్‌లో కేవ‌లం ముగ్గురు ఫీల్డ‌ర్లే ఉన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆన్‌సైడ్‌లో ఐదుగురికి మించి ఉండ‌కూడ‌దు. దీన్ని గ‌మ‌నించిన అంపైర్ నోబాల్ ఇచ్చాడు. దీంతో ఢిల్లీకి ఫ్రీ హిట్ ల‌భించింది. ప్రీహిట్ బంతిని నిగ‌మ్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు.

ఇక మ్యాచ్ విషయానికి వ‌స్తే.. సూర్య‌కుమార్ యాద‌వ్ (73 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీయ‌గా.. చ‌మీర‌, ముస్తాఫిజుర్‌, కుల్దీప్ యాద‌వ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Nita Ambani : మ్యాచ్ గెలిచాక ఆట‌గాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వ‌స్తే.. నీతా అంబానీ ఏం చేశారో చూడండి..

ఆ త‌రువాత ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ ఘోరంగా విఫ‌ల‌మైంది. 18.2 ఓవ‌ర్ల‌లో 121 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ముంబై 59 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ముంబై బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్న‌ర్ చెరో మూడు వికెట్లు తీశారు. బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్‌, విల్ జాక్స్‌, క‌ర్ణ్ శ‌ర్మ ఒక్కొ వికెట్ సాధించారు.