RCB : ప్లేఆఫ్స్‌కు ముందు గుడ్‌న్యూస్‌.. ఆర్‌సీబీ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర ఆట‌గాడు..

ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్‌సీబీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

RCB : ప్లేఆఫ్స్‌కు ముందు గుడ్‌న్యూస్‌.. ఆర్‌సీబీ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర ఆట‌గాడు..

RCB Sign Tim Seifert As Jacob Bethell Set To Leave For England National Duties

Updated On : May 22, 2025 / 2:45 PM IST

ఐపీఎల్ 2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఇన్నాళ్లుగా అంద‌ని ద్రాక్ష‌గా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను ఈ సారి ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలో ఇప్ప‌టికే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం రెండో స్థానంలో ఉంది. కాగా.. ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్‌సీబీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌ట్టులోకి న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు, విధ్వంస‌క‌ర వీరుడు టిమ్ సీఫెర్ట్ ను తీసుకుంది.

ఆర్‌సీబీ ఇప్ప‌టి వ‌ర‌కు లీగ్ ద‌శ‌లో 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. లీగ్ ద‌శ‌లో మ‌రో రెండు (మే 23న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, మే 27న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌)మ్యాచ్‌లు ఆడ‌నుంది. అయితే.. స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్ అనంత‌రం ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జాక‌బ్ బెథెల్ సేవ‌ల‌ను ఆర్‌సీబీ కోల్పోనుంది. జాతీయ జ‌ట్టు త‌రుపున ఆడేందుకు అత‌డు ఐపీఎల్‌ను వీడ‌నున్నాడు.

IND vs ENG : ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు, కెప్టెన్‌గా ధోని శిష్యుడు..

ఈ క్ర‌మంలో అత‌డి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు, వికెట్ కీప‌ర్‌ టిమ్ సీఫెర్ట్‌ను ఆర్‌సీబీ జ‌ట్టులోకి తీసుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. అత‌డు మే 24 నుంచి జ‌ట్టులో భాగం కానున్న‌ట్లు చెప్పింది. ఈ నేప‌థ్యంలో అత‌డు ల‌క్నోతో మ్యాచ్‌లో బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి.

MI vs DC : ప్లేఆఫ్స్‌కు చేరుకోని ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జ‌రిమానా..

ఆర్‌సీబీ అత‌డిని రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. టిమ్ సీఫెర్ట్ కివీస్‌ త‌రుపున‌ ఇప్ప‌టి వ‌ర‌కు 66 టీ20 మ్యాచ్‌ల్లో 1540 ప‌రుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి 26 ప‌రుగులు సాధించాడు.