European Champion Spain : ప్రతిష్టాత్మక యూరో కప్ 2024లో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఆదివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 2-1తో తేడాతో ఓడించింది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువచ్చిన స్పెయిన్ ఆఖరి మ్యాచ్‌లోనూ తన హవాను కొనసాగించింది. దీంతో స్పెయిన్ వరుసగా నాలుగో సారి యూరో కప్‌ను ముద్దాడింది.
అదే సమయంలో ఇంగ్లాండ్ వరుసగా రెండో సారి రన్నరప్ టోఫీతోనే సరిపెట్టుకుంది. 47వ నిమిషయంలో నికో విలియమ్స్, 86వ నిమిషంలో మైకెల్ ఓయర్జాబల్ లు స్పెయిన్ తరుపున గోల్స్ చేయగా.. ఇంగ్లాండ్ తరుపున నమోదైన ఏకైక గోల్ ను కోలె పాలెమెర్ 73వ నిమిషంలో సాధించాడు.
ఈ మ్యాచ్‌లో తొలి అర్థభాగంలో స్పెయిన్, ఇంగ్లాండ్ జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. ప్రత్యర్థి గోల్ పోస్టులపై పదే పదే దాడులు చేశాయి. అయినప్పటికి తొలి అర్థభాగంలో ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలం అయ్యాయి. అయితే.. సెకండ్ ఆఫ్ ప్రారంభమైన రెండు నిమిషాలకే (47వ నిమిషంలో) స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్ నికో విలియమ్స్ అద్భుత గోల్ చేశాడు. దీంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడు పెంచారు. పదే పదే స్పెయిన్ గోల్ పోస్టులపై దాడులు చేశారు. 73వ నిమిషయంలో సక్సెస్ సాధించారు. కోలె పాలెమెర్ గోల్ కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోరును 1-1తో సమం చేసింది. అయితే.. 86వ నిమిషయంలో మైకెల్ ఒయర్జాబల్ గోల్ సాధించడంతో స్పెయిన్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. మ్యాచ్ సమయం ముగిసే వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన స్పెయిన్ విజేతగా నిలిచింది.
MS Dhoni : నేను సైనా నెహ్వాల్ భర్తని.. ధోనితో కశ్యప్.. తలా ఆన్సర్ వైరల్..
?? Spain are champions of Europe ?#EURO2024 pic.twitter.com/Ch0AF0iPWl
— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024