EX British PM David Cameron praises Virat Kohli
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ అసాధారణ నాయకుడు అని కొనియాడాడు. ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాడని చెప్పాడు. ఎన్‌డిటివి వరల్డ్ సమ్మిట్‌లో పాల్గొన్న కామెరూన్‌కు మీకు నచ్చిన భారత క్రికెటర్ ఎవరు ప్రశ్న ఎదురైంది. తనకు రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని కామెరూన్ చెప్పారు.
తాను చాలా పెద్దవాడినని, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీని చూస్తూ పెరిగినట్లు తెలిపారు. ఇక ఇంగ్లాండ్‌లో రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన సెంచరీని చూడడాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక విరాట్ కోహ్లీ అసాధారణ లీడర్ అని చెప్పాడు. మైదానంలో అతడి కెప్టెన్సీ అద్భుతం అని, స్ఫూర్తిని కలిగిస్తాడని చెప్పారు.
BAN vs SA : చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. ప్రపంచ రికార్డు బ్రేక్..
ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. చూస్తూ ఉండాలని, భవిష్యత్తులో బ్రిటన్-ఇండియన్ ఆటగాళ్లు ఎంతో మంది వస్తారన్నారు. భారత్ పై విజయం సాధిస్తారు అని కామెరూన్ అన్నారు.
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ 70 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 36 ఏళ్ల తరువాత భారతదేశంలో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ గెలిచింది.
Babar Azam : బాబర్ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు.. ఇలా చేయ్.. లేదంటే..
ఇక భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ అక్టోబర్ 24న పూణే వేదికగా ప్రారంభం కానుంది.