Pakistan : 17 మంది ఆట‌గాళ్లు.. 60 గ‌దులు.. ఏం త‌మాషాగా ఉందా..?

పాకిస్తాన్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2024లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది.

Ex Pakistan Star Atiq uz Zaman Tears Into Players Holidaying In USA

పాకిస్తాన్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2024లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్క‌మించింది. దీంతో బాబ‌ర్ ఆజాం సేన పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల జ‌డివాన కురుస్తోంది. మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు, నెటిజ‌న్లు పాక్ ఆట‌గాళ్ల‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. ఈ జాబితాలో మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అతిక్ ఉజ్ జ‌మాన్ కూడా చేరిపోయాడు. మీరంతా అక్క‌డికి క్రికెట్ ఆడేందుకు వెళ్లారా లేక హాలీడే ట్రిప్ కోస‌మా అంటూ మండిప‌డ్డాడు.

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్ర్క‌మించిన‌ప్ప‌టికీ త‌రువాత కెప్టెన్ బాబ‌ర్ ఆజాం, హ్యారిస్‌ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ అమీర్‌, ఇమాద్‌ వసీం తదితరులు పాకిస్తాన్‌కు వెళ్ల‌కుండా లండ‌న్‌కు వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వీరంతా త‌మ కుటుంబంతో క‌లిసి కొన్ని రోజులు అక్క‌డ స‌ర‌దాగా గ‌డ‌ప‌నున్నారు. ఇంకొంద‌రు మాత్రం అమెరికాలోనే ఉన్నారు.

WI vs ENG : అత‌డి వ‌ల్లే ఓట‌మి.. వాడు జ‌ట్టులో ఉన్నాడంటే.. వెస్టిండీస్ కెప్టెన్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

ఐసీసీ ఈవెంట్‌లో పరాభవానికి తోడు.. ఆటగాళ్లు ఇలా హాలిడే ట్రిప్‌నకు వెళ్లడంతో మాజీ క్రికెటర్ అతిక్ ఉజ్ జ‌మాన్ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో జ‌ట్టుతో పాటు మేనేజ‌ర్‌, ఒక కోచ్ మాత్ర‌మే ఉండేవాడ‌ని చెప్పాడు. అయితే.. ప్ర‌స్తుతం 17 మంది ఆట‌గాళ్లు, వారి కోసం మ‌రో 17 మంది అధికారులు ఉన్నారు. మొత్తం 60 గదుల‌ను బుక్ చేయాలి. ఏంటీ త‌మాషాగా ఉందా..? మీరు అక్క‌డి వెళ్లింది క్రికెట్ ఆడేందుకా..? హాలిడేకా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

ప్ర‌పంచ‌క‌ప్ లాంటి ఈవెంట్ల‌లో కుటుంబ స‌భ్యుల‌ను ఎందుకు అనుమ‌తిస్తారు అంటూ పాక్ క్రికెట్ బోర్డు తీరును త‌ప్పుబ‌ట్టాడు. భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌డం ఆట‌గాళ్ల‌కు బాగా అల‌వాటైంద‌న్నాడు. కుటుంబంతో క‌లిసి బ‌య‌టి వెళ్ల‌డం ఫుడ్ తిన‌డం, ఫోటోలు, వీడియోలు తీసుకోవ‌డం ఇదేప‌ని చేస్తున్నార‌ని, ఇక వీరు ఆట‌పై శ్ర‌ద్ద పెట్ట‌డం లేద‌న్నాడు. గ‌తంలో పాక్ జ‌ట్టులో ఇలాంటి సంస్కృతి ఉండేది కాద‌న్నారు. ఒక్క‌రు కూడా ఆట ప‌ట్ల శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చ‌డం లేద‌న్నాడు. ప్ర‌తీ ఏడాది కోట్ల‌కు కోట్లు మ్యాచ్ ఫీజులు మాత్రం తీసుకుంటున్నార‌న్నాడు.

Gautam Gambhir : ఇంట‌ర్వ్యూలో గంభీర్‌ను అడిగిన మూడు ప్ర‌శ్న‌లు ఇవే..!

కాగా.. అతీక్‌.. పాకిస్తాన్‌ తరఫున ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడాడు.

ట్రెండింగ్ వార్తలు