Gautam Gambhir : ఇంట‌ర్వ్యూలో గంభీర్‌ను అడిగిన మూడు ప్ర‌శ్న‌లు ఇవే..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాలం ముగియ‌నుంది.

Gautam Gambhir : ఇంట‌ర్వ్యూలో గంభీర్‌ను అడిగిన మూడు ప్ర‌శ్న‌లు ఇవే..!

Gautam Gambhir

Gautam Gambhir : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాలం ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో కొత్త కోచ్‌గా ఎవ‌రు వ‌స్తారు అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. కాగా.. కొత్త కోచ్‌కు సంబంధించిన ఎంపిక ప్ర‌క్రియ మొద‌లైంది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్ ల‌తో కూడిన క్రికెట్ స‌ల‌హా క‌మిటీ(సీఏసీ) మంగ‌ళ‌వారం ఇద్ద‌రిని ఇంట‌ర్వ్యూలు చేసింది. ఇందులో ఒక‌రు టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ కాగా.. మ‌రొక‌రు భార‌త మ‌హిళా జ‌ట్టుకు కోచ్‌గా ప‌ని చేసిన డబ్ల్యూవీ రామన్‌.

వ‌ర్చువ‌ల్‌గా గౌత‌మ్ గంభీర్ ఈ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ ఇంట‌ర్వ్యూలో గంభీర్ ను కమిటీ సులువుగా అనిపించే మూడు క‌ష్ట‌మైన ప్ర‌శ్న‌లు వేసింది.

మొద‌టి ప్రశ్న.. టీమ్ఇండియా కోచింగ్ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలు ఏంటి?

రెండో ప్ర‌శ్న‌.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్పుడు..జ‌ట్టులో మార్పులు చేయాల్సి వ‌స్తే ఆ ప‌రిస్థితిని ఎలా ఎదుర్కొంటారు.?

మూడో ప్ర‌శ్న‌.. ఒక్కొ ఫార్మాట్‌కు ఒక్కొ కెప్టెన్‌, వ‌ర్క్‌లోడ్‌కు అనుగుణంగా ఆట‌గాళ్ల ఫిట్‌నెస్ ప‌రిమితులు, ఐసీసీ ఈవెంట్లలో భారత్ ట్రోఫీని గెలవలేకపోవడం.. వంటి విషయాలపై మీ అభిప్రాయాలు ఏంటి? అనే మూడు ప్ర‌శ్న‌ల‌ను గంభీర్‌, రామ‌న్‌ల‌ను అడిగిన‌ట్లుగా ఓ క్రీడా ఛానెల్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది.

Also Read: T20 World Cup 2024 : రోహిత్‌తో గొడ‌వ‌.. బంగ్లాదేశ్ యువ పేస‌ర్ కి ఐసీసీ జ‌రిమానా..

ఇక రాహుల్ ద్ర‌విడ్ వార‌సుడిగా గంభీర్ ను కోచ్‌గా చేయాల‌ని బీసీసీఐ భావిస్తోంద‌ని, ఇంట‌ర్వ్యూలు లాంఛ‌న‌మేన‌ని అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక బుధ‌వారం రెండో రౌండ్ ఇంట‌ర్వ్యూలు పూర్తి అయిన త‌రువాత గంభీర్‌ను కోచ్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Also Read: చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. వ‌రుస‌గా రెండు వ‌న్డేల్లోనూ శ‌త‌కాలు.. ఏకైక భార‌త ప్లేయ‌ర్‌..