WI vs ENG : అత‌డి వ‌ల్లే ఓట‌మి.. వాడు జ‌ట్టులో ఉన్నాడంటే.. వెస్టిండీస్ కెప్టెన్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్ జ‌ట్టులోని ఆట‌గాళ్లు కీల‌క స‌మ‌యంలో ఫామ్‌లోకి వ‌చ్చారు.

WI vs ENG : అత‌డి వ‌ల్లే ఓట‌మి.. వాడు జ‌ట్టులో ఉన్నాడంటే.. వెస్టిండీస్ కెప్టెన్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

Rovman Powell on Phil Salt match winning knock in WI vs ENG

West Indies vs England : డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్ జ‌ట్టులోని ఆట‌గాళ్లు కీల‌క స‌మ‌యంలో ఫామ్‌లోకి వ‌చ్చారు. గ్రూప్‌ ద‌శ‌లో అష్ట‌క‌ష్టాలు ప‌డి సూప‌ర్ 8 చేరుకుంది ఇంగ్లాండ్‌. అయితే.. సూప‌ర్ 8 తొలి మ్యాచ్‌లోనే జూలు విదిల్చింది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న వెస్టిండీస్ జ‌ట్టుకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. సెయింట్ లూసియా వేదిక‌గా గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. విండీస్ ఆట‌గాళ్ల‌లో జాన్సన్ చార్లెస్ (38), కెప్టెన్ పావెల్ (36), నికోల‌స్ పూర‌న్ (36) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్‌, ఆదిల్ ర‌షీద్‌, మోయిన్ అలీ, లివింగ్ స్టోన్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Gautam Gambhir : ఇంట‌ర్వ్యూలో గంభీర్‌ను అడిగిన మూడు ప్ర‌శ్న‌లు ఇవే..!

అనంత‌రం ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ (87 నాటౌట్; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) పెను విధ్వంసం సృష్టించ‌గా.. జానీ బెయిర్‌స్టో (48 నాటౌట్; 26 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విండీస్ బౌల‌ర్ల‌లో ఆండ్రి రస్సెల్, రోస్టన్ ఛేజ్ లు చెరో వికెట్‌ పడగొట్టారు.

ఆ ఒక్క‌డి వ‌ల్లే..

మ్యాచ్ అనంత‌రం విండీస్ కెప్టెన్‌ పావెల్ మాట్లాడాడు. ఫిలిప్ సాల్ట్ వ‌ల్లే మ్యాచ్‌లో ఓడిపోయిన‌ట్లు చెప్పాడు. ప్ర‌తిసారి కూడా సాల్ట్ మా జ‌ట్టుకు బాధ‌ను క‌లిగిస్తూనే ఉన్నాడ‌ని చెప్పాడు. బ్యాటింగ్‌లో 15 నుంచి 20 ప‌రుగులు త‌క్కువ‌గా చేశామ‌ని, ఆఖ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో సామ‌ర్థ్యం మేర‌కు బ్యాటింగ్ చేయ‌లేక‌పోయిన‌ట్లు తెలిపాడు. ఇందుకు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నాడు. వాళ్లు చాలా అద్భుతంగా బంతులు వేశార‌న్నాడు.

T20 World Cup 2024 : రోహిత్‌తో గొడ‌వ‌.. బంగ్లాదేశ్ యువ పేస‌ర్ కి ఐసీసీ జ‌రిమానా..

సాల్ట్ ఎప్పుడూ మాకు ఓట‌మి బాధ‌ను మిగులుస్తున్నాడు. అతడి పై మా ప్ర‌ణాళిక‌లు స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోతున్నామ‌న్నాడు. ఇక టోర్నీలో త‌మ భ‌విష్య‌త్తు గురించి మాట్లాడుతూ.. మిగిలిన మ్యాచుల్లో ఘ‌న విజ‌యాలు సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. కాగా.. బ్రెండ‌న్ గాయం గురించి కాస్త ఆందోళ‌న చెందుతున్న‌ట్లు చెప్పాడు. త‌రువాతి మ్యాచ్‌లో అత‌డు బ‌రిలోకి దిగుతాడ‌నే ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు.

విండీస్ అంటే సాల్ట్‌కు పూన‌కం..

వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటే చాలు ఇంగ్లాండ్ ఓపెన‌ర్ సాల్ట్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు చెల‌రేగి పోతాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మ్యాచులు అత‌డు విండీస్ పై ఆడాడు. 68 స‌గ‌టు 186 స్ట్రైక్‌రేటుతో 478 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, రెండు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ క‌ల‌క‌లం..!