×
Ad

Rohit Sharma : రోహిత్ భ‌య్యా.. వ‌డాపావ్ కావాలా..? హిట్‌మ్యాన్ ఆన్స‌ర్ అదుర్స్..

కొంద‌రు అభిమానులు రోహిత్ భయ్యా (Rohit Sharma) వడాపావ్ కావాలా? అని స‌ర‌దాగా అడిగారు.

Fan Offers Vada Pav Rohit Sharma Reply Goes Viral

Rohit Sharma : జ‌న‌వ‌రి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ కోసం రోహిత్ శ‌ర్మ తీవ్రంగా సాధ‌న చేస్తున్నాడు. ఇక ముంబైలో నెట్స్‌లో సాధన ముగించుకుని వ‌స్తున్న రోహిత్ శ‌ర్మ‌ను చూడ‌గానే ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేశారు.

అయితే.. ఇంత‌లో కొంద‌రు అభిమానులు రోహిత్ భయ్యా వడాపావ్ కావాలా? అని స‌ర‌దాగా అడిగారు. దీనికి స‌మాధానంగా రోహిత్ శ‌ర్మ చేయి ఊపుతూ వ‌ద్దు అని బ‌దులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Faf du Plessis : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన‌ ఫాఫ్ డుప్లెసిస్.. ఒకే ఒక సౌతాఫ్రికా ఆట‌గాడు

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma) కు వ‌డాపావ్ అంటే చాలా ఇష్టం అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్రక‌టించిన హిట్ మ్యాన్ ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌కప్ ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో త‌న ఫిట్‌నెస్ పై పూర్తిగా ఫోక‌స్ పెట్టాడు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం నేపాల్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. రోహిత్ పౌడెల్ నాయ‌క‌త్వంలోనే..

ఈ క్ర‌మంలో త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన వ‌డాపావ్‌ను సైతం దూరంగా పెట్టాడు. కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రోహిత్ 11 కిలోల బరువు త‌గ్గి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్ర‌స్తుతం రోహిత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు.