Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండో ఓటమిని చవిచూసింది. అది కూడా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కావడం గమనార్హం. గురువారం చిన్నస్వామి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడానికి పరోక్షంగా విరాట్ కోహ్లీ కారణం అని చాలా మంది మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూస్తే అలవోకగా 200 దాటేలా కనిపించింది. ఇందుకు కారణం ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ (37; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు). మూడో ఓవర్‌లో స్టార్క్ బౌలింగ్‌లో అతడు తన విశ్వరూపాన్ని చూపించాడు. వరుసగా 6, 4, 4, 4, 6 బాదడంతో ఈ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. దీంతో ఆర్‌సీబీ స్కోరు మూడు ఓవర్లలోనే 50 పరుగులు దాటింది.
కానీ.. నాలుగో ఓవర్‌లో ఫిల్ సాల్ట్ రనౌట్ కావడంతో ఆర్‌సీబీ పరుగుల ప్రవాహానికి బ్రేక్ పడింది. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లోని ఐదో బంతికి సాల్ట్ షాట్ కొట్టాడు. పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. విప్రజ్ నిగమ్ బంతిని అందుకోవడం చూసిన కోహ్లీ.. మధ్యలో ఆగిపోయాడు. రన్ వద్దని చెప్పాడు. అప్పటికే పిచ్ సగానికి వచ్చిన సాల్ట్ వెనక్కి వెళ్లే క్రమంలో తన బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. అతడు లేచి క్రీజును చేరే లోపు ఫీల్డర్ విప్రజ్ బంతిని కీపర్ కేఎల్ రాహుల్ కు త్రో చేయగా.. రాహుల్ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతో ఫిల్‌సాల్ట్ రనౌట్ అయ్యాడు.
𝗔 𝗩𝗜𝗣 𝗺𝗼𝘃𝗲 𝘂𝗻𝗱𝗲𝗿 𝗽𝗿𝗲𝘀𝘀𝘂𝗿𝗲 🫡
Vipraj Nigam breaks down the game-changing run-out that put #DC in the driver’s seat 🔥#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/KXqwp9Mv6f
— IndianPremierLeague (@IPL) April 11, 2025
దీనిపై అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ గనుక ఆగకుండా వెళ్లి ఉంటే రన్ వచ్చేదని సాల్ట్ రనౌట్ అయ్యేవాడు కాదని అంటున్నారు. సాల్ట్ ఉండి ఉంటే ఆర్‌సీబీ భారీ స్కోరు చేసేదని అంటున్నారు. కోహ్లీ స్వార్థపరుడు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
కేఎల్ రాహుల్‌ను రెచ్చగొట్టాడు..
విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. ప్రత్యర్థి జట్టు వికెట్ కోల్పోయినప్పుడు అతడు చేసే సంబురాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ వికెట్ కోల్పోయినప్పుడు కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు)) వద్దకు వచ్చి కోహ్లీ.. విజయం మాదే అంటున్నట్లుగా సంబురాలు చేసుకుంటూ అతడిని రెచ్చగొట్టాడు. కట్ చేస్తే రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించుకున్నాడు.
విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం కేఎల్ రాహుల్ పిచ్ పై బ్యాట్‌తో.. ఈ మైదానం ఎవ్వరిది కాదు.. నా సొంత మైదానం అన్నట్లుగా అతడు సింబాలిక్‌గా చూపించాడు. ఇది కోహ్లీ మైదానం కాదని, తన సొంత మైదానం అని రాహుల్ చేసిన దానికి అర్థం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Virat Kohli messed with wrong guy. KL Rahul answered him with bat. 🔥 pic.twitter.com/tB3OgcDy6n
— Selfless⁴⁵ (@SelflessCricket) April 10, 2025
Even Selfishness is also ashamed of Virat Kohli. pic.twitter.com/blgu3RY462
— ` (@R0hitinveins) April 10, 2025
Phil Salt played very well but should not have been run out.😳😳
Virat Kohli got him out.💔#RCBvsDC #RCBvDC #PhilSalt pic.twitter.com/O9uWp9lARB
— Nagendra pandey (@nagendr_24) April 10, 2025
1 like = 1000 slaps for #ViratKohli 😤
It was selfish from Virat Kohli as RCB needs more of Phil Salt than #ViratKohli ATM at Chinnaswamy
Now Chokli is out ffs 😏
#RCBvsDC Royal Challengers Bengaluru vs Delhi Capitals #MSDhoni pic.twitter.com/7MrotOb9DD
— Zoze Morita (@zozemorita) April 10, 2025