×
Ad

Rohit Sharma : కెప్టెన్సీ తొలగింపు తర్వాత తొలిసారి రోహిత్ శర్మ ఎమోషనల్ స్పీచ్..! అంతా ద్రవిడ్ ప్రణాళికలే..

Rohit Sharma : CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు.

Rohit Sharma

Rohit Sharma : భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శర్మను టీమిండియా మేనేజ్మెంట్ తప్పించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మను పక్కనపెట్టి.. యువ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తరువాత తొలిసారి రోహిత్ శర్మ మౌనం వీడాడు.

27వ CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల వేడుక మంగళవారం (అక్టోబర్‌ 7) ముంబైలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఇటీవలి కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు సంబంధిత విభాగాల్లో పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకల్లో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన తన సతీమణి రితికాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

Also Read: IND vs WI 2nd test : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. కేఎల్ రాహుల్, ర‌వీంద్ర జ‌డేజాల‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే..

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ పై ఉత్సాహం వ్యక్తం చేశాడు. నాకు ఆస్ట్రేలియాలో ఆడటం చాలా ఇష్టం. అక్కడి ప్రజలు క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడతారు. అయితే, ఆస్ట్రేలియాలో ఆడటం ఎప్పుడూ సవాలే. ఎన్నిసార్లు అక్కడికి వెళ్లినా, ప్రతిసారి కొత్త అనుభవమే ఉంటుంది. ఇప్పుడు నాకు అక్కడ ఏం ఎదురవుతుందో బాగా తెలుసు. భారత జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడి.. విజయం సాధిస్తామని ఆశిస్తున్నాను అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. అయితే, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన విషయంపై రోహిత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ పై ఉత్సాహం వ్యక్తం చేస్తూ, అక్కడి క్రికెట్ వాతావరణాన్ని ఆస్వాదిస్తానని చెప్పారు.


అయితే, ఈ ఏడాది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒకప్పుడు రచించిన ప్రణాళికలను అనుసరించడం కూడా ఒక కారణమని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. భారత జట్టు వరుసగా టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో కొన్నేళ్ల ముందు నుంచి జట్టు చేసిన కృషి కీలకమని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. అయితే, భారత జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తరువాత ద్రవిడ్ కోచ్‌గా తప్పుకున్నాడు. ఆ తరువాత గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాడు. అతడి శిక్షణలోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది.