IND vs WI 2nd test : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలను ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అక్టోబర్ 10 నుంచి రెండో టెస్టు మ్యాచ్ (IND vs WI 2nd test) ప్రారంభం కానుంది.

Rahul Jadeja on the verge of scaling milestones ahead of IND vs WI 2nd test
IND vs WI 2nd test : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 14 వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలను పలు మైలురాళ్లు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో రాహుల్ 111 పరుగులు, జడేజా 10 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 4000 పరుగుల మైలురాయిని చేరుకుంటారు.
2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో అడగుపెట్టిన కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లు ఆడాడు. 112 ఇన్నింగ్స్‌ల్లో 36 సగటుతో 3889 పరుగులు సాధించాడు. ఇందులో 11 శతకాలు, 19 అర్థశతకాలు ఉన్నాయి. ఇక అత్యధిక స్కోరు 199.
జడేజా విషయానికి వస్తే.. 2012లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 86 మ్యాచ్‌లు ఆడాడు. 129 ఇన్నింగ్స్‌ల్లో 38.7 సగటుతో 3990 పరుగులు సాధించాడు. ఇందులో 6 శతకాలు, 27 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 175 నాటౌట్. ఇక బౌలింగ్‌లో 334 వికెట్లు తీశాడు. ఇందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్, జడేజా..
కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు సూపర్ పామ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌లో పరుగుల వరద పారించిన రాహుల్ విండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. జడేజా సైతం వెస్టిండీస్‌తో మొదటి టెస్టు మ్యాచ్‌లో (104 నాటౌట్) శతకం బాదాడు. ఇక వీరిద్దరిలో నాలుగు వేల పరుగుల మైలురాయిని ఎవరు చేరుకుంటారో చూడాలి.
జడేజాకు 10 పరుగులే అవసరమైన కూడా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు అన్న సంగతి మరిచిపోకూడదు.