Tazmin Brits : చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా ప్లేయర్ టాజ్మిన్ బ్రిట్స్ .. స్మృతి మంధాన వరల్డ్ రికార్డు బ్రేక్..
దక్షిణాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) చరిత్ర సృష్టించింది.

Womens World Cup 2025 Tazmin Brits breaks Smriti Mandhana world record
Tazmin Brits : దక్షిణాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాజ్మిన్ బ్రిట్స్ (101; 89 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత అందుకుంది.
ఈ క్రమంలో ఆమె టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన రికార్డును బ్రేక్ చేసింది. మంధాన 2024, 2025 క్యాలెండర్ ఇయర్‌లలో నాలుగేసి సెంచరీలు చేసింది. కాగా.. న్యూజిలాండ్‌తో సెంచరీ బ్రిట్స్ కు ఈ ఏడాది 5వది. ఇందులో చివరి ఐదు వన్డేల్లోనే బ్రిట్స్ నాలుగు సెంచరీలు చేయడం గమనార్హం.
మహిళల క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు..
* టాజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాప్రికా) – 5 సెంచరీలు (2025లో)
* స్మృతి మంధాన (భారత్) – 4 సెంచరీలు (2025లో)
* స్మృతి మంధాన (భారత్) – 4 సెంచరీలు (2024లో)
అత్యంత వేగంగా ఏడు శతకాలు..
తాజా శకంతో టాజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) మరో రికార్డును సొంతం చేసుకుంది. వన్డేల్లో ఆమెకు ఇది ఏడో సెంచరీ. ఈ క్రమంలో మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఏడు శతకాలు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా రికార్డుకు ఎక్కింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ పేరిట ఉండేది. 44 ఇన్నింగ్స్‌ల్లో లాన్నింగ్ ఏడు శతకాలు చేయగా.. టాజ్మిన్ బ్రిట్స్ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించింది.
వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఏడు శతకాలు చేసిన ప్లేయర్లు వీరే..
* టాజ్మిన్ బ్రిట్స్ – 41 ఇన్నింగ్స్‌లు
* మెగ్ లాన్నింగ్ – 44 ఇన్నింగ్స్‌లు
* టామీ బ్యూమాంట్ – 62 ఇన్నింగ్స్‌లు
* సుజీ బేట్స్ – 81 ఇన్నింగ్స్‌లు
* కరెన్ రోల్టన్/హేలే మాథ్యూస్ – 83 ఇన్నింగ్స్‌లు
* స్మృతి మందాన – 84 ఇన్నింగ్స్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్లు 47.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ సోఫీ డివైన్ (85; 98 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసింది. బ్రూక్ హాలిడే (45) రాణించింది. సపారీ బౌలర్లలో నాన్కులులేకో మ్లాబా నాలుగు వికెట్లు తీసింది.
The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩
Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25 pic.twitter.com/NfSYRjCsOY
— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025
ఆ తరువాత టాజ్మిన్ బ్రిట్స్ (101) సెంచరీ బాదగా సునే లూస్ (83 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించడంతో 232 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.