Asia Cup 2024 : క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. జూలై 19 భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ

క్రికెట్ అభిమానుల‌ను అల‌రించేందుకు మ‌రో టోర్నీ సిద్ద‌మైంది.

Free entry for fans in Womens Asia Cup 2024 India vs Pakistan match on July 19

Womens Asia Cup 2024 : క్రికెట్ అభిమానుల‌ను అల‌రించేందుకు మ‌రో టోర్నీ సిద్ద‌మైంది. మ‌రో ఆరు రోజుల్లో మ‌హిళ‌ల టీ20 ఆసియా క‌ప్‌-2024 ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నుంది. జూలై 19 నుంచి 28 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో రెండు సెమీ-ఫైనల్, ఓ ఫైనల్ కూడా ఉంది. 8 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొనున్నాయి. 8 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్ ఏలో టీమ్ఇండియా, పాకిస్తాన్ , యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్ , మలేషియా, థాయ్‌లాండ్ లు ఉన్నాయి.

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జూలై 19న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా.. టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు శుభవార్త చెప్పింది. స్టేడియాల్లోకి ఫ్రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో ఎలాంటి న‌గ‌దు చెల్లించ‌డానే అభిమానులు స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చు.

Kapil Dev : బీసీసీఐకి క‌పిల్‌ లేఖ‌.. మా మొత్తం పెన్ష‌న్‌ ఇస్తాం.. గైక్వాడ్‌కు సాయం చేయండి

లంక బోర్డు వైస్ ప్రెసిడెంట్ విక్ర‌మ ర‌త్నె మాట్లాడుతూ.. మహిళల ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పారు. మ‌హిళ‌ల క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెంచే ఉద్దేశ్యంతో ప్రేక్ష‌కుల‌కు ఉచిత ప్ర‌వేశాన్ని క‌ల్పిస్తున్నాము అని అన్నారు. అంత‌ర్జాతీయ ప్లాట్‌ఫార‌మ్స్‌లో అన్ని మ్యాచుల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు.

గ్రూపు ద‌శ జూలై 19 నుంచి 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. జూలై 26న సెమీ ఫైన‌ల్స్‌, జూలై 28న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. గ్రూపులోని ఒక్కొ జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. అనంత‌రం గ్రూపులో మొద‌టి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీ ఫైన‌ల్ ఆడ‌నున్నాయి. ఈ టోర్నీలోని అన్ని మ్యాచులు కూడా దంబుల్లా వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. మ్యాచులు అన్నీ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్నాయి.

Riyan Parag : హార్దిక్ పాండ్యాతో న‌టి అన‌న్య పాండే డ్యాన్స్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న రియాన్ ప‌రాగ్‌..? మీమ్స్ వైర‌ల్‌

టీమ్ఇండియా మ్యాచుల షెడ్యూల్‌..
హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ నాయ‌క‌త్వంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది.

– జూలై 19న పాకిస్థాన్‌,
– జూలై 21న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ),
– జూలై 23న నేపాల్‌

ఆసియాకప్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), ఉమా చెత్రీ (వికెట్ కీప‌ర్‌), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్

Shubman Gill Sister : పాపం గిల్‌..! స్నేహితుడు అని న‌మ్మితే.. టీమ్ఇండియా స్టార్ క్రికెట్‌తో గిల్ సోద‌రి ప్రేమ‌..?

రిజర్వ్ ప్లేయ‌ర్లు.. శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్.

ట్రెండింగ్ వార్తలు